అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన బాలయ్య: సర్‌ప్రైజ్‌కు రెడీగా ఉండండి అంటూ ప్రకటన
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తైంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
'అఖండ' పట్టాలపై ఉండగానే.. నటసింహా నందమూరి బాలకృష్ణ.. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రవితేజతో చేసిన 'క్రాక్' మాదిరిగానే ఈ సినిమాను కూడా నిజ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాడు. ఇందుకోసం లైబ్రెరీలకు వెళ్లి మరీ ఏళ్ల నాటి చరిత్రను తిరగేస్తున్నాడు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న రాబోతుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మే 28న 'అఖండ' సినిమా నుంచి కూడా ఓ పాట విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్ ఫొటోను ఉంచడంతో పాటు రేపు ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు. దీంతో అది ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











