twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్.. లుక్ అదిరింది

    |

    యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సాహూ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా ఆగస్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ నేపథ్యంలో సాహోకి సంబందించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి నింపుతున్నారు. తాజాగా చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న అరుణ్ విజయ్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ఎంతో స్టైలిష్‌గా ఉంది. ఈ పోస్టర్‌ని బట్టి చూస్తే హీరో మొదలుకొని సాహూ లోని అన్ని క్యారెక్టర్లు హైలైట్ గానే ఉంటాయని తెలుస్తోంది. పైగా ఈ పోస్టర్‌పై ''Blood Doesn't Need Bloody ఇన్విటేషన్'' అనే క్యాప్షన్‌ పెట్టారంటే చిత్రంలో అరుణ్ విజయ్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌ అనేది తెలిసిపోతోంది. అరుణ్ విజయ్ 'సాహో'లో విశ్వాంక్ అనే పాత్ర పోషించాడు.

    Surprising Poster From Prabhas Saaho

    భారతదేశ సినీ చరిత్రలో రికార్డులు తిరగరాసిన 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వస్తున్న సినిమా కావడంతో 'సాహో' సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇందుకు తోడు హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఉన్న ఆతృతను మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ చూడొచ్చని చెబుతోంది చిత్రయూనిట్.

    English summary
    After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. Now from this movie Arun Vijay Look released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X