twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానులకు ప్రభాస్ కిక్.. దృష్టి మొత్తం దానిపైనే..!

    |

    యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, చుంకీ పాండే లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూపు సాహో పై ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరత్వరగా ముగించి హై రేంజ్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది చిత్రయూనిట్.

    ఈ మేరకు ప్రభాస్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే షేడ్స్ అఫ్ సాహో వీడియోలు చిత్రంలో యాక్షన్ ఓరియెంటెడ్ సీన్స్ ఎలా ఉంటాయనేది చెప్పకనే చెప్పేశాయి. మరోవైపు ఈ మూవీ నుంచి రిలీజ్ అవుతున్న లిరికల్ సాంగ్స్ ప్రభాస్, శ్రద్ద కెమిస్ట్రీ తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫేస్‌బుక్‌ వేదికగా హీరో ప్రభాస్ ఓ వీడియోను పంచుకొని తన అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.

    Surprising video from Prabhas Saaho

    ఈ వీడియో చిన్నదైనా ఇందులో ప్రభాస్ యాక్టింగ్ టెక్నీక్స్, దర్శకుడి సూచనలను ఆయన పాటించే తీరు కనిపిస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తి నింపింది. బాక్సింగ్‌ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో దర్శకుడు సుజీత్‌ సూచనలు ఇస్తుండగా, ప్రభాస్‌ శ్రద్ధగా వింటూ కనిపించారు. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న సాహూ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting major part is successfully completed. present saaho team busy with post production works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X