ఐ బొమ్మ రవిపై మాట్లాడితే నా సినిమాను వదిలిపెట్టరు... నాగవంశీ షాకింగ్ కామెంట్స్

ఐ బొమ్మ రవి ఇష్యూ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదుపుతోంది. అతని అరెస్ట్‌ని విమర్శించేవారు, వ్యతిరేకించే రెండు వర్గాలు తయారయ్యాయి. ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ అయితే ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలని సీరియస్ అయ్యారు. మరో వెర్షన్‌లో అతనిని అరెస్ట్ చేయడం అన్యాయమంటూ సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. అతనికి మద్ధతు పలికేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఈ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో పైరసీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన వారిలో సూర్యదేవర నాగవంశీ కూడా ఒకరు. ఆయన నిర్మాణ సారథ్యంలో వచ్చిన పలు చిత్రాలు పైరసీ బారినపడ్డాయి. ఈ ఏడాది సమ్మర్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన మ్యాడ్ స్క్కేర్ హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో నాగవంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్సీస్ సెన్సార్ సమయంలో ఈ ప్రింట్లు లీక్ అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీ గ్యాంగ్స్ చేతికి ప్రింట్స్ ఎలా అందుతున్నాయో నిఘా పెడుతున్నామని అన్నారు. ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ.. వారి కంటెంట్‌ను పైరసీ కాకుండా నిరోధిస్తోందని, అదే స్ట్రాటజీని మేం కూడా అనుసరిస్తామని నాగవంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Suryadevara Naga Vamsi makes sensational comments on IBOMMA Ravi at EPIC Movie Event

మళ్లీ జత కలిసిన హిట్ పెయిర్
తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రం ఎపిక్. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తుండగా.. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఎపిక్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగ్గా.. నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐబొమ్మ రవిని రాబిన్‌హుడ్ చేసేశారు
90'స్‌ జనరేషన్‌లో ఒక మేజిక్ ఉంది, ఆ ఎరా బాగుందని అంటూ ఉంటారు. ఆ మేజిక్ ఏంటీ? ఇప్పుడు ఏం మిస్ అయ్యింది? అని విలేకరి అడగ్గా.. దానికి నాగవంశీ స్పందించారు. సోషల్ మీడియా ... ఐ బొమ్మ రవిగాడినే రాబిన్‌హుడ్‌ని చేసిన లోకంలో ఉన్నాం మనం. 90'sకీ, దీనికీ ఏం పోలికలు చెబుతాం. వాడు రాబిన్‌హుడ్ అయిపోయాడు మాకు.. మేం ఏదో తప్పు చేసినవాళ్లం అయిపోయాం 50 రూపాయలు టికెట్ పెంచితే. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.. అలాంటి సోసైటీలో ఉంటూ మీరు తప్పేం జరిగిందని అడుగుతున్నారు అని నాగవంశీ వ్యాఖ్యానించారు.

Take a Poll

నా సినిమాను టార్గెట్ చేస్తారు
ఆ తర్వాత మీడియా ప్రతినిధులు ఐ బొమ్మ రవి ఇష్యూపైనే ప్రశ్నలు అడగటానికి ప్రయత్నించగా నాగవంశీ సీరియస్ అయ్యారు. అసలు ఆ టాపిక్ వద్దు... ఆ టాపిక్ మాట్లాడితే, నాకు పండక్కి సినిమా వస్తోంది. దానిని ఏదో ఒక భ్రష్టు పట్టిస్తారు... వద్దు. నేనేదో కామెడీగా అన్నాను, అక్కడితో అదిఅయిపోయింది అని నాగవంశీ తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. మరి వీటిపై సినీరంగం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: suryadevara naga vamsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X