బాలయ్య ప్రొడ్యూసర్‌పై ఆ హీరో ఫ్యాన్స్ బూతుల వర్షం .. డెడ్‌లైన్ పెట్టి మరి

తన ఓన్ టాలెంట్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. చిన్నా చితకా పాత్రలు చేస్తూ టాలెంట్ నిరూపించుకున్న విజయ్ జీవితాన్ని పెళ్లిచూపులు సినిమా మలుపు తిప్పింది . ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్‌కి చేరింది. ఆయన స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్‌కు యూత్ ఫిదా అయ్యింది. తెలుగువాళ్లే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా ఆయనకు ఫ్యాన్స్‌‌గా మారిపోయారు.

అర్జున్ రెడ్డి తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి నటించిన గీతా గోవిందం క్లాసికల్ మూవీగా భారీ వసూళ్లు సాధించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. వరుస విజయాలతో విజయ్ దేవరకొండ ఎక్కడికో వెళ్లిపోయారు. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ ద్వారా ఆయన పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

suryadevara naga Vamsi officially confirms vijay devarakonda s VD 12 Title release date

లైగర్ తర్వాత చేసిన ఖుషి, ది ఫ్యామిలీమెన్ సినిమాలు కూడా బొక్కబోర్లాపడటంతో విజయ్ కెరీర్ డైలమాలో పడ్డారు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ ఆ ప్రాజెక్ట్స్ కోసం కష్టపడుతున్నారు. రాహుల్ సంకృత్యాన్ మూవీ పీరియాడికల్ డ్రామాగా తెలుస్తోంది. ఇప్పటికే అమ్మవారి శిల్పం బ్యాక్‌డ్రాప్‌లో రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే దీని కంటే ముందు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న VD 12 రిలీజ్ కానుంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈసారి సాలీడ్ హిట్ కొట్టాలని శ్రమిస్తున్నారు రౌడీ స్టార్.

సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న VD 12లో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ హీరో వరుస ఫ్లాపుల్లో ఉండటంతో పాటు ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ రాకపోవడంతో విజయ్ అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నారు.

VD 12 గురించిన అప్‌డేట్స్ ఇవ్వాలని, లేదంటూ నిర్మాత నాగవంశీపై రౌడీ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఆయనను ఏకంగా బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా నాగవంశీ వెల్లడించారు. అభిమానుల దెబ్బకు ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన ఓ ట్వీట్ చేశారు. మీ అందరి తిట్లు భరించలేక గౌతమ్‌ని చాలా హింస పెట్టి VD 12 టైటిల్‌ను ఫైనల్ చేశామని.. త్వరలోనే దీనిని వెల్లడిస్తామని ఆ ట్వీట్‌లో నాగవంశీ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారోనని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X