twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించండి.. గర్జించిన కంగన, అంకిత, కృతి సనన్

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతున్నది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే, హీరోయిన్ కంగన రనౌత్ లాంటి తారలు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దేశవ్యాప్తంగా పలువురు నటీనటులు బహిరంగంగా సీబీఐ డిమాండ్‌కు మద్దతు తెలియజేస్తున్నారు.

    కృతిసనన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు ద్వారా స్పందిస్తూ.. త్వరలోనే నిజాలు బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సుశాంత్ ఫ్యామిలీ, స్నేహితులు, అభిమానులు, అతడిని ఇష్టపడే ప్రతీ ఒక్కరికి న్యాయం జరుగాలని కోరుకొంటున్నాను. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా సీబీఐ కేసును దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాలని ప్రార్థిస్తున్నాను. అలా న్యాయం జరిగితే సుశాంత్ ఆత్మకు సంపూర్ణంగా శాంతి చేకూరుతుంది. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాను అని అన్నారు.

    Sushant case: Kangana Ranaut, Kriti Sanon, Ankita Lokhande demands CBI Probe

    కంగన రనౌత్ టీమ్ ట్వీట్టర్‌లో స్పందిస్తూ.. త్వరగా ఈ కేసును ముగించే తొందరలో ముంబై పోలీసులు ఉన్నారు. సంజయ్ రౌత్ లాంటి నేతలు విచారణ ముగిసిందని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని కోరుకొంటున్నాను అని అన్నారు.

    Sushant case: Kangana Ranaut, Kriti Sanon, Ankita Lokhande demands CBI Probe

    సుశాంత్ కేసులో న్యాయం జరుగాలని దేశం మొత్తం కోరుకొంటున్నది. కాబట్టి సుశాంత్‌కు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే అని అంకితా లోఖండే పోస్టర్‌తో డిమాండ్ చేశారు.

    English summary
    Sushant Singh Rajput death case: Kangana Ranaut, Kriti Sanon, Ankita Lokhande demands CBI Probe. Kangana wrote that, Mumbai police wants to rush the probe, Sanjay Raut saying they are almost done with the investigation, we deserve to know the truth #CBIForSSR republic #justiceforSushanthSinghRajput shwetasinghkirt anky1912
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X