15 కోట్ల సంగతేంటి.. మూడో రోజు కూడా సిబీఐ విచారణకు రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ప్రధాన అనుమానితులను సీబీఐ వరుసగా ఎనిమిది రోజుల నుంచి విచారిస్తూనే ఉంది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో అవకతవకలు, లెక్క తేలని 15 కోట్ల రూపాయల, డ్రగ్స్ తదితర అంశాలపై రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి గత మూడు రోజులుగా విచారిస్తున్నారు.
రియా చక్రవర్తిని శుక్రవారం 10 గంటలపాటు విచారించగా, శనివారం 7 గంటలపాటు పలు విషయాలపై ప్రశ్నించినట్టు సమాచారం. అయితే సుశాంత్‌కు డిప్రెషన్ ఉందనే విషయంపైనే రియా చక్రవర్తి ఎక్కువ సమాధానాలు చెప్పినట్టు సమాచారం. అంతకు మించి ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడలేదు అని సీబీఐ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం.

ఆదివారం రోజున కూడా రియా, షోవిక్‌తోపాటు వంట మనిషి నీరజ్, దీపేష్ సావంత్, సిద్ధార్థ్ పితాని తదితరులను మరోసారి విచారణకు పిలిచారు. ఆదివారం ఉదయమే రియా సీబీఐ విచారణకు హజరయ్యారు. ఈ కేసులో సుశాంత్ సోదరి మీతూ సింగ్‌ను కూడా విచారించేందుకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం.
ఇక డ్రగ్స్ వ్యవహారంలో డీలర్ గౌరవ్ ఆర్యకు సమన్లు జారీ చేశారు. గోవాలో ఉంటున్న గౌరవ్ ఆదివారం ముంబైలో సీబీఐ విచారణకు హాజరవుతారనే విషయం మీడియాలో కనిపించింది. ఈ క్రమంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో సీబీఐ ఆదివారం సమావేశమవుతారని బాలీవుడ్ మీడియా కథనాలను వెల్లడించింది.


Click it and Unblock the Notifications











