‘Sushant Singh Rajput ఉరివేసుకొని చనిపోలేదు..దారుణంగా హింసించి చంపారు.. మృతికి ముందు అలాంటి దాడి’

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నిర్వహించిన పోస్టు మార్టంలో అనేక అవకతవకలు జరిగాయి. ఆయన మరణం ఆత్మహత్య కాదు. ముమ్మాటికి అది హత్యే అని ముంబై కూపర్ హాస్పిటల్‌కు చెందిన మాజీ ఉద్యోగి మరోసారి సంచలన విషయాలు వెల్లడించారు. జూన్ 14, 2020 తేదీన ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో అనుమానాస్పదంగా మరణించిన సుశాంత్‌ది ఆత్మహత్య అంటూ కూపర్ హాస్పిటల్ నివేదికలో తెలిపింది. అయితే ఇటీవల హాస్పిటల్ నుంచి రిటైర్ అయిన ఉద్యోగి రూప్ కుమార్ షా ఆ రోజు జరిగిన పోస్ట్ మార్టం గుట్టును రట్టు చేశారు. తాజాగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ మరణం వెనుక దారుణమైన విషయాలు వెల్లడిస్తూ...

వీఐపీ బాడీ వచ్చిందని తెలియడంతో

వీఐపీ బాడీ వచ్చిందని తెలియడంతో

పోస్టు మార్టం నిర్వహించడానికి కావాల్సిన పేపర్ వర్క్ ఆలస్యం కావడంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాడీ మా వద్దకు ఆలస్యంగా వచ్చింది. వీఐపీ బాడీ వచ్చిందని తెలియడంతో నాకు చాలా ఆసక్తి కలిగించింది. నేను ముందుగా రాజకీయ నాయకుడిదని అనుకొన్నాను. పోస్ట్ మార్టం టేబుల్ వస్త్రం విప్పి బాడీని చూడగా.. అది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది కావడం షాక్ కలిగించింది అని రూప్ కుమార్ షా చెప్పాడు.

సూసైడ్ అని ఎలా చెబుతున్నారని

సూసైడ్ అని ఎలా చెబుతున్నారని

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాడీని చూడగానే చాలా అనుమానాలు కలిగాయి. ఫస్ట్ ఆయనది సూసైడ్ కాదని నిర్ఱారణకు వచ్చాను. వెంటనే నా సహచర ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. సుశాంత్ మరణాన్ని ఎలా సూసైడ్ అని చెబుతున్నారనే అనుమానం కలిగింది. బాడీని చూసిన తర్వాత ఉరి వేసుకొని చనిపోలేదు. విపరీతమైన టార్చర్ తర్వాత ఆయన మర్డర్ చేశారు అనే విషయం మాకు స్పష్టమైంది అని రూప్ కుమార్ షా చెప్పారు.

మరణానికి ముందు దాడి.. తీవ్రమైన పెనుగులాట

మరణానికి ముందు దాడి.. తీవ్రమైన పెనుగులాట

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది సూసైడ్ కాదని బలంగా ఎలా చెబుతున్నానంటే.. సాధారణంగా ఏ వ్యక్తైనా ఉరి వేసుకొంటే..ఆ వ్యక్తి మెడ చుట్టూ ఒకే ఒక మచ్చ ఉంటుంది. అయితే సుశాంత్ విషయంలో ఆయన మరణానికి ముందు పెద్ద మొత్తంలో కొంత మందితో తీవ్రమైన పెనుగులాట, తోపులాట జరిగినట్టు ఆయన శరీరంపై ఆనవాళ్లు కనిపించాయి. ఇతరుల నుంచి దాడి జరిగినప్పుడు నిరోధించేటప్పుడు శరీరంపై ఉండే గాయాలు సుశాంత్ బాడీపై కనిపించాయి. శరీరం మీద చాలా చోట్ల గాట్లు, దెబ్బలు, ఉన్నాయి. సూసైడ్ చేసుకొనే వ్యక్తి మృతదేహానికి, మర్డర్ జరిగే వ్యక్తి బాడీకి చాలా తేడాలు ఉంటాయి. ఆ తేడాలే నాకు కనిపించాయి అని రూప్‌కుమార్ షా చెప్పారు.

ముఖంపై బలంగా పిడిగుద్దులు

ముఖంపై బలంగా పిడిగుద్దులు

ఇక సుశాంత్ బాడీపై దారుణంగా దాడి జరిగిందని చెప్పడానికి ఆయన ముఖంపై, ఎడమ కన్ను, కుడి కన్ను పక్కన బలంగా ఎవరో గుద్దినట్టు కనిపించే గాయాలు ఉన్నాయి. రెండు కళ్ల కింద కొడితే కమిలిపోయే గాయలు కనిపించాయి. అలాంటి విషయాలు నా దృష్టికి రాగానే.. వెంటనే నాపై అధికారి డాక్టర్ వద్దకు వెళ్లి చెప్పాను. ఇది సూసైడ్ కాదు.. మర్డర్ అని అన్నాను. దాంతో నీవు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు. మేము చెప్పింది చేయి అని నాపై ఫైర్ అయ్యాడు అని రూప్ కుమార్ చెప్పారు.

అస్తవ్యస్తంగా పోస్టు మార్టం నిర్వహణ

అస్తవ్యస్తంగా పోస్టు మార్టం నిర్వహణ

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్టు మార్టం కూడా అస్తవ్యస్తంగా నిర్వహించారు. పోస్టు మార్టం నిర్వహించే విధానానికి విరుద్ధంగా ఆ ప్రక్రియను ముగించారు. పోస్టు మార్టం నిర్వహించే సమయంలో వీడియోగ్రఫి చేయాలని సూచించాను. కానీ అందుకు నిరాకరించిన డాక్టర్.. కేవలం ఫోటోలు మాత్రమే తీశారు. ఒకవేళ వీడియో తీసి ఉంటే.. సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు.. మర్డర్ అని ఇంకా చాలా విషయాలు చెప్పేవాడిని. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీసి ఉంటే చాలా విషయాలు వెలుగులోకి వచ్చేవి అని రూప్ కుమార్ షా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X