twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసులో సీబీఐ కీలక నిర్ణయం.. రియా తల్లిదండ్రులను కూడా..

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ఈడీ, సీబీఐ, ఎన్సీబీ సంస్థలు తమ దర్యాప్తు జోరును పెంచేశారు. గత 12 రోజులుగా ఎడతెగని విచారణను అధికారులు కొనసాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు.

    అయితే మంగళవారం రియాకు ఈడీ సమన్లు జారీ చేయలేదని ఆమె తరఫు న్యాయవాది సతీష్ మానేషిండే స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో సుశాంత్ తల్లిదండ్రులను సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

     Sushant Singh Rajput Case: CBI to summons Rhea Chakraborty parents

    గత ఐదురోజులుగా రోజుకు దాదాపు 10 గంటల చొప్పున ప్రశ్నించడం మీడియాలో చర్చనీయాంశమైంది. సుశాంత్ బ్యాంకు అకౌంట్లలో అవకతవకల ఆరోపణలు, హార్డ్ డిస్క్‌లలో డేటా డిలీట్ తదితర అంశాలపై లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం.

    అయితే మీడియాలో ట్రయల్స్‌పై రియా చక్రవర్తితోపాటు కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపై శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధిస్తున్నట్టు మీడియాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం వివాదంగా మారింది.

    English summary
    Sushant Singh Rajput Case: CBI to summons Rhea Chakraborty parents. Rhea's lawyer Satish Maneshinde has clarified that the actor has not been summoned by Enforcement Directorate (ED) on Tuesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X