twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sushant Singh Rajput డ్రగ్స్ కేసులో ఎన్సీబీ పంజా.. సుశాంత్ పక్కింటి వ్యక్తి అరెస్ట్

    |

    బాలీవుడ్ నటుడు, స్వర్గీయ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పంజా విసిరింది. ఈ కేసులో పాతిక మందికిపైగా డ్రగ్స్ సప్లయర్లను అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. దీంతో మరోసారి బాలీవుడ్‌కు డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి. కొద్ది రోజులుగా ముంబైలో డ్రగ్స్ అమ్మకాలు, సరఫరా వ్యవహారాలపై దృష్టి పెట్టిన అధికారులు ముందస్తు సమాచారంతో పక్కా ప్లాన్ వేసి సాహిల్ షా అలియాస్ ప్లాకో అనే డ్రగ్స్ సప్లయర్‌ను అరెస్ట్ చేసింది.

    గతంలో అంటే 2021 ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులను డ్రగ్స్‌తో పట్టుకొన్న కేసులో ఫ్లాకోను విచారించాలని ప్రయత్నిస్తున్నది. కానీ 8 నెలలుగా ఫ్లాకో తప్పించుకు తిరుగుతున్నారు. సాహిల్ షా కదలికలపై దృష్టిపెట్టిన అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకొన్నారు. అయితే సుశాంత్‌కు ఫ్లాకో ఇరుగుపొరుగు వ్యక్తి కావడం గమనార్హం.

    Sushant Singh Rajput death case: NCB arrest drug Peddler Sahil Shah

    గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసును ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే విచారించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత 6 నెలలుగా సాహిల్ షా కోసం వెతుకుతున్నాం. ఆయన కోసం మలాడ్‌లోని నివాసంలో దాడులు చేయగా, అతడి భార్య, తల్లి మాత్రమే ఉన్నారు. ఈ ఇంటికి సమీపంలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉండేవారు అని తెలిపారు.

    అయితే డ్రగ్స్ కేసులో తనను వెంటాడుతుండటంతో సాహిల్ షా జాగ్రత్తపడ్డారు. తన లాయర్ సహాయంతో బాంబే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దాంతో ఎన్సీబీకి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

    ఇదిలా ఉండగా, జూన్ 14, 2020 తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద పరిస్థితుల్లో బాంద్రాలోని తన నివాసంలో మరణించారు. అప్పటి నుంచి పలు కోణాల్లో సీబీఐ, ఈడీ, ఎన్సీబీ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు..

    English summary
    Narcotics Control Bureau (NCB) Arrests Sushant Singh Rajput's Neighbour Sahil Shah In Connection With Drugs Case. Sahil Shah alias Flacko absconding for eight months in the drugs case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X