అవెంజర్స్ రికార్డును తిరగరాసిన దిల్ బేచారా, చరిత్ర సృష్టించిన సుశాంత్.. ప్రభాస్ రికార్డు మాయం!

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారా చిత్రం ప్రపంచ సినిమా రంగంలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ట్రైలర్‌కు సంబంధించిన లైక్స్ విషయంలో ఇప్పటి వరకు ఏ సినిమా లభించనన్నీ లైక్స్ దిల్ బేచారా ట్రైలర్ లభించడం ఓ అరుదైన ఘనతగా సినీ పండితులు భావిస్తున్నారు. జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. దిల్ బేచారా చిత్రం ఆయన చివరి చిత్రం కావడంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల భావోద్వేగంగా స్పందిస్తున్నారు. దిల్ బేచారా సినిమా ట్రైలర్ రికార్డుల గురించి వివరాలు ఇలా ఉన్నాయి...

జూలై 24న డిస్నీ+హాట్‌స్టార్‌లో

జూలై 24న డిస్నీ+హాట్‌స్టార్‌లో


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజనా సంఘీ జంటగా నటించిన దిల్ బేచారా చిత్రం జూలై 24వ తేదీన డిస్నీ+హాట్ స్టార్ అనే ఓటీటీలో ప్రసారం చేయాలని దర్శకుడు ముఖేష్ చాబ్రా, నిర్మాత ఫాక్స్ స్టార్ ప్రతినిథులు నిర్ణయించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దిల్ బేచారా చిత్రం ట్రైలర్‌ను సోమవారం జూలై 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అవెంజర్స్: ది ఎండ్‌గేమ్ రికార్డులు బ్రేక్

అవెంజర్స్: ది ఎండ్‌గేమ్ రికార్డులు బ్రేక్

అయితే దిల్ బేచారా సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్యమైన స్పందన లభించింది. ఇప్పటి వరకు ఏ సినిమా ట్రైలర్‌కు రానటువంటి లైక్స్ దిల్ బేచారాకు కేవలం 24 గంటల్లోనే రావడం విశేషంగా మారింది. గతంలో అంటే గతేడాది మార్చిలో రిలీజైన అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా ట్రైలర్‌కు అత్యధికంగా అంటే 2.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే అత్యధికంగా లైక్స్ సాధించిన ట్రైలర్‌ అనే రికార్డు ఎండ్‌గేమ్‌పై ఉంది.

దిల్ బేచారా ట్రైలర్‌కు అనూహ్య స్పందన

దిల్ బేచారా ట్రైలర్‌కు అనూహ్య స్పందన


ఇక దిల్ బేచారా విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ గత 24 గంటలకుపైగా సమయంలో 6.6 మిలియన్ల లైక్స్ సాధించడం ఓ రికార్డుగా నిలిచింది. ఇక 25 అన్‌లైక్స్ నమోదు అయ్యాయి. జూలై 7వ తేదీ సాయంత్రం వరకు ఈ ట్రైలర్‌కు 3,38,05,134 వ్యూస్ లభించడం గమనార్హం. సుశాంత్‌పై ఉన్న సానుభూతి వల్లనో లేదా ఆయనపై అభిమానం ఉన్న కారణంగానో దిల్ బేచారా ఎవరూ తిరగరాయలేని రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.

ప్రభాస్ సాహో రికార్డు బ్రేక్

ప్రభాస్ సాహో రికార్డు బ్రేక్

ఎండ్ ‌గేమ్ రికార్డును బ్రేక్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూవీ దిల్ బేచారా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా జీరో రికార్డును అధిగమించలేకపోయింది. యూట్యూబ్‌లో జీరో చిత్రం 24 గంటల్లో 50 మిలియన్ల వ్యూస్ సాధించగా, సుశాంత్ దిల్ బేచారా ఆ రికార్డును అందుకోలేకపోయింది. కాకపోతే అక్షయ్ కుమార్ నటించిన గుడ్ న్యూస్ సాధించిన 20 మిలియన్లు వ్యూస్, ప్రభాస్ సాహో సాధించిన 31 మిలియన్ల వ్యూస్‌ను యూట్యూబ్‌లో అధిగమించడం విశేషం.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
జాన్ గ్రీన్ పుస్తకం ఆధారంగా మూవీ

జాన్ గ్రీన్ పుస్తకం ఆధారంగా మూవీ


ప్రముఖ రచయిత జాన్ గ్రీన్ రాసిన ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే పుస్తకం ఆధారంగా దిల్ బేచారా సినిమా తెరకెక్కింది. కైజీ, మన్నీ అనే ఇద్దరు సాధారణ యువతీ, యువకుల మధ్య చోటుచేసుకొన్న ఎక్ట్రార్డినరీ ప్రేమకథగా రూపొందుతున్నది. వారి జీవితాల్లో రెండు విషాదా సంఘటనలు ఉన్నాయి. అయినా వారు తమ జీవితాన్ని ఫన్నీగా, థ్రిల్లింగ్‌గా గడపడం అనేది కథలో బలమైన పాయింట్‌గా కనిపించింది. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X