సుశాంత్ సూసైడ్: బాలీవుడ్ సెలబ్రిటీని 5 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల విచారణ నిరంతరంగా కొనసాగుతున్నది. గతవారం దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, శేఖర్ కపూర్‌ను విచారించిన బాంద్రా పోలీసులు అదే జోరును కొనసాగించారు. జూలై 10వ తేదీన బాలీవుడ్ పరిశ్రమలో టాలెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రేష్మా శెట్టిని విచారించారు. దాదాపు 5 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమెను విచారించినట్టు సమాచారం.
బాలీవుడ్‌లో రేష్మా శెట్టికి బలమైన సంబంధాలు ఉన్నాయి. అగ్ర నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆలియా భట్ లాంటి వారితో కలిసి పనిచేశారు. కత్రినా కైఫ్, పలువురు యాక్టర్లు ఎండార్స్ చేసే వాణిజ్య ప్రకటనలను రేష్మా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు.

బిగ్‌బాస్, సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యుమన్ లాంటి సంస్థలతో పనిచేస్తున్నారు. ామె మ్యాట్రిక్స్ అనే టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రేష్మాను పోలీసుల విచారించి సుశాంత్ వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకొన్నట్టు సమాచారం.
Recommended Video
జూన్ 14వ తేదీన సుశాంత్ సూసైడ్ చేసుకొన్న తర్వాత ఇప్పటి వరకు 35 మందిని ముంబై పోలీసులు ప్రశ్నించి వారి వాగ్మూలాలను రికార్డు చేశారు. సాధ్యమైనంత వరకు ఈ కేసుకు సంబంధించిన బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











