అలవైకుంఠపురములో టీజర్.. హైప్ పెంచేస్తోన్న యూనిట్.. దెబ్బకు ట్రెండింగ్‌లోకి

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఎప్పుడూ పండగే. గతం వీరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడానికి అల వైకుంఠపురములో అంటూ వచ్చేస్తున్నారు.

 పాటలతో ప్రభంజనం..

పాటలతో ప్రభంజనం..

అల వైకుంఠపురములో చిత్రానికి సంగీతమనేది అతిపెద్ద బలంగా మారిందని ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలను బట్టి చెప్పొచ్చు. సామజవరగమన, రాములో రాముల, ఓఎమ్‌జీ డాడీ అనే పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ కొత్త కొత్త రికార్డులను లిఖిస్తూ పోతూనే ఉన్నాయి.

టీజర్‌తో ట్రీట్..

టీజర్‌తో ట్రీట్..

ఇప్పటి వరకు పాటలతోనే ఫ్యాన్స్‌ను అలరించిన బన్నీ.. టీజర్‌తో స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. అయితే సోమవారం నాడే రిలీజ్ కావాల్సిన ఈ టీజర్.. మెగా ఫ్యాన్ నూర్ మహ్మద్ మరణంతో వాయిదా పడింది. అయితే ముందుగా చెప్పిన టైమ్‌కు కాకుండా కాస్త ఆలస్యంగా వస్తోన్న ఈ టీజర్‌పై అంచనాలు పెంచేందుకు చిత్రబృందం భారీ ప్లాన్లే వేస్తోంది.

టీజర్ గ్లింప్స్‌తోనే అదరగొట్టేశారు..

టీజర్ గ్లింప్స్‌తోనే అదరగొట్టేశారు..

తినబోయే ముందు రుచి చూడటమెందుకు అనేది పాత లెక్క.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఏదైనా ఒక్కొక్కటిగా స్లో పాయిజన్‌లా ఎక్కించడమే నేటి పద్దతి. ఈ క్రమంలో టీజర్ అంటూ ఆలస్యంగా వస్తోన్న గ్లింప్స్‌తో రుచి చూపించాడు. బన్నీ స్టైల్, త్రివిక్రమ్ టైప్ కామెడీ అన్నీ ఉండబోతోన్నట్లు గ్లింప్స్‌తో చెప్పేశారు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 రంగంలోకి దిగిన సుశాంత్, నివేదా, థమన్..

రంగంలోకి దిగిన సుశాంత్, నివేదా, థమన్..

ఈ టీజర్ నేటి సాయంత్రం 4.05గంటలకు విడుదల కాబోతోందని సుశాంత్, నివేదా పేతురాజ్‌, థమన్‌లతో చెప్పిస్తూ.. భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది చిత్రయూనిట్. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఈ టాపిక్ ట్రెండింగ్‌లోకి వచ్చి.. టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. మరి టీజర్ రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X