twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త అవతారమెత్తిన అక్కినేని హీరో.. ఇదైనా కలిసి వస్తుందా..?

    |

    అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమయ్యాడు సుశాంత్. చేసింది కొన్ని సినమాలే అయినా మంచి పేరే తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో వచ్చినన్నీ హిట్స్ తరువాతి కాలంలో కనుమరుగయ్యాయి. కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సుశాంత్ ఆ తరువాత చాలా కాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూశాడు. తాజాగా మళ్లీ వెలుగులోకి వచ్చిన ఈ హీరో కొత్త అవతారమెత్తాడు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

    చి.ల.సౌతో సెకండ్ ఇన్నింగ్స్..

    చి.ల.సౌతో సెకండ్ ఇన్నింగ్స్..

    చి.ల.సౌ అనే ఓ సినిమా లేకుండా సుశాంత్‌ను తెలుగు ప్రేక్షకులు మరిచిపోయేవారేమోనన్న అనుమానం కలుగుతుంది. ఈ ఒక్క సినిమాతో సుశాంత్ నిలబడ్డాడు. ఇన్నేళ్ల ఎదురుచూపుల తరువాత వచ్చిన ఈ విజయన్నా సరిగా వాడుకోవడం లేదని అనిపిస్తోంది.

    స్పీడ్ పెంచని హీరో..

    స్పీడ్ పెంచని హీరో..

    చిలసౌ సినిమా వచ్చి ఇన్ని రోజులవుతున్నా.. సోలో హీరోగా ఒక్క చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాడు. వచ్చిన హిట్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అల వైకుంఠపురములో చిత్రంలో చేసిన ఓ క్యారెక్టర్ పర్వాలేదనిపించేలానే ఉంది.

    తాజాగా కొత్త చిత్రం..

    తాజాగా కొత్త చిత్రం..

    అల వైకుంఠపురములో చిత్రం విడుదలకు ముందు సుశాంత్ పేరు వినబడినా.. రిలీజయ్యాక అతని పేరు ఎక్కడా వినబడలేదు. రీసెంట్‌గా తన కొత్త సినిమాను ప్రారంభించేశాడు సుశాంత్. ఇచ్చట వాహనములు నిలుపరాదు అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్నాడు. తాజాగా ఈ హీరో మరో అవతారం కూడా ఎత్తాడు.

    Recommended Video

    Akkineni Sushanth Speech At AlaVaikunthapurramuloo Success Meet | Filmibeat Telugu

    స్ప్రైట్‌కు బ్రాండ్ అంబాసిడర్..

    మన హీరోల్లో బ్రాండ అంబాసిడర్ అంటే గుర్తొచ్చేది మహేష్ బాబే. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఉత్పత్తుల లిస్ట్ తీస్తే చాంతాడంతా అవుతుంది. తాజాగా సుశాంత్ శీతల పానీయం స్ప్రైట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోన్నట్లు పేర్కొన్నాడు. మరి ఈ రకంగా సుశాంత్‌కు కలిసి వచ్చి.. మరిన్ని యాడ్స్ వస్తాయా? అన్నది చూడాలి.

    English summary
    Sushanth As Sprite Ambassador. Sushanth Shared That Summer is here and so am I with my first Ad and some Sprite!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X