ఇచ్చట వాహనములు నిలపరాదు టీజర్: సుశాంత్ ఈ సారి హిట్ కొట్టేలానే ఉన్నాడుగా

అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించాడు సుశాంత్. కెరీర్ ఆరంభంలో వేగంగా సినిమాలు చేసిన అతడు.. ప్రతికూల ఫలితాలు ఎదురవుతుండడంతో నెమ్మదించాడు. దీంతో చాలా గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చి.ల.సౌ' అనే సినిమాతో హిట్ కొట్టాడతడు. ఈ మూవీకి జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఈ అక్కినేని వారి హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో ముఖ్య పాత్రను పోషించి మెప్పించాడు.

సుదీర్ఘ విరామం తర్వాత సుశాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలపరాదు'. ఎస్‌ దర్శన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఐ స్టూడియోస్‌, శాస్త్రా మూవీ బ్యానర్లపై రవి శంకర్‌ శాస్త్రి, హరీష్‌ కోయలగుండ్లలు నిర్మిస్తున్నారు. మీనాక్ష్మీ చౌదరి హీరోయిన్‌గా చేస్తుండగా.. ఒకప్పటి హీరో వెంకట్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. ఎమ్ సుకుమార్‌ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 Sushanths Ichata Vahanumulu Niluparadu Teaser Released

తాజాగా 'ఇచ్చట వాహనములు నిలపరాదు' టీజర్‌ను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. 90 సెకెన్ల నిడివి గల ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. 'మా అమ్మకి.. ఆ అమ్మాయికి.. నా బైక్‌కు అవినాభావ సంబంధం ఉంది' అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. మధ్యలో వెన్నెల కిశోర్ అండ్ కో కామెడీ కూడా మెప్పించింది. అలాగే, చివర్లో హీరో బైక్‌ను హైలైట్ చేస్తూ చూపించిన సీన్స్ కూడా బాగున్నాయి. ప్రవీణ్‌ లక్కరాజు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. మొత్తంగా ఈ టీజర్ చూసిన వారంతా సుశాంత్ ఈ సారి హిట్ కొట్టడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Read more about: sushanth సుశాంత్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X