సుశాంత్ సింగ్ సూసైడ్ ఎఫెక్ట్.. కరణ్ జోహార్ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయా?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినిమా ఇండస్ట్రీలలో అందరిని షాక్ కి గురి చేసిందనే చెప్పాలి. నిండు భవిష్యత్తు ఉన్న యువ టాలెంట్ ఆ విధంగా ప్రాణాలు తీసుకోవడం వెనక ఎన్నో తెలియని దుష్ట శక్తులు ఉన్నాయని సాధారణ జనాలతో పాటు స్టార్ సెలబ్రెటీస్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక ఎక్కువగా కరణ్ జోహార్ పై ప్రభావం కనపడినట్లు తెలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput ఎఫెక్ట్... Karan Johar New Decision
 ఒక మార్క్ ఇమేజ్..

ఒక మార్క్ ఇమేజ్..

దర్శకుడిగా నిర్మాతగా అలాగే యాంకర్ గా కూడా నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఉండే అతి దరిద్రమైన నెపోటీజమ్ ఉందనే పదం కరణ్ జోహార్ వల్లే ఎక్కువవుతోందని అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

తక్కువ చేసి మాట్లాడటం..

తక్కువ చేసి మాట్లాడటం..

కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్ హౌజ్ నుంచి సినీ తారల పిల్లల్ని మాత్రమే యాక్టర్స్ గా పరిచయం చేయిస్తున్నాడు గాని కొత్తగా వచ్చిన వారిని ఒక్కరినైనా గుర్తించాడా అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో కూడా కరణ్ జోహార్ పై ఇలాంటి కామెంట్స్ వచ్చాయి కానీ ఈ రేంజ్ లో అయితే విమర్శలు రాలేదు. అంతే కాకుండా సుశాంత్ పై గత ఇంటర్వ్యూలలో కరణ్ తక్కువ చేసి మాట్లాడడంతో నెటీజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సుశాంత్ మరణానికి కారణం..

సుశాంత్ మరణానికి కారణం..

ఈ సారి సినీ తారలు కూడా కరణ్ జోహార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం కరణ్ జోహార్ లాంటి వ్యక్తులేనని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విమర్శల కారణంగా కరణ్ జోహార్ కూడా కాస్త ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు స్సమాచారం.

ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయా..

ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయా..

స్టార్ వారసులతో మాత్రమే సినిమాలు చేస్తాడు అనే కామెంట్స్ నుంచి తప్పించుకోవడానికి భవిష్యత్తులో స్టార్స్ తో చేయాలనుకున్న కొన్ని ప్రాజెక్టులను రిజెక్ట్ చేశాడట. కొన్నాళ్ళ పాటు కరణ్ స్టార్స్ ఫ్యామిలీలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త టాలెంట్ ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కొత్త కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X