నవంబర్‌లో సుశాంత్ సింగ్ పెళ్లి.. అంతలోనే ఈ దారుణం.. ఏజెంట్ ద్వారా బయటపడ్డ సీక్రెట్!
రోజురోజుకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే ప్రశ్న చుట్టూ ఎన్నో ఊహాగానాలు బాలీవుడ్ సినీ ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం పలువురి సెలబ్రేటిస్ పై కూడా పోలీస్ కేసులు నమోదవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. అయితే సుశాంత్ సింగ్ పెళ్లి చేసుకోవడానికి సిద్దామయ్యారనే విషయం ఒక ప్రాపర్టీ ఏజెంట్ ద్వారా ఇటీవల బయటపడింది.
Recommended Video

చనిపోయిన రోజు నుంచి..
సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు నుంచి నెటీజన్స్ ఎక్కువగా బాలీవుడ్ బడా స్టార్స్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర సమయంలో విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులపై మర్డర్ కేసు కూడా నమోదవ్వడం సంచలనంగా మారింది. సుశాంత్ అభిమానులే కాకుండా సినీ సెలబ్రెటీస్ లలో చాలా మంది బాలీవుడ్ లో ఆధిపత్యం నెపోటీజమ్ ఉందని చెప్పడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

పెళ్లి చేసుకోవాలని..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. సుశాంత్ కొన్ని నెలల క్రితం 2020లోనే పెళ్లి చేసుకోవాలని ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాడట. కొంత కాలం నుంచి రియా చక్రవర్తితో సుశాంత్ రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి వరకు వచ్చిన వారి వ్యవహారం ఊహించని విధంగా మలుపులు తిరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు కూడా బాంద్రాలోనే ఒక ఒక మంచి ఇల్లు తీసుకోవాలని అనుకున్నారట.

అమ్మాయి ఎవరో చెప్పలేదు..
సుశాంత్ కి దగ్గరి బంధువైన ఒక వ్యక్తి నవంబర్ లో సుశాంత్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తనకు చెప్పినట్లు మీడియాకు తెలియజేశారు. అయితే అమ్మాయి ఎవరనే విషయంలో క్లారిటీగా చెప్పలేదని అన్నారు. ఇక రియా చక్రవర్తికి తెలిసిన ఒక ప్రాపర్టీ ఏజెంట్ ద్వారా కేసులో ఒక కొత్త విషయం బయటపడినట్లు తెలుస్తోంది.

కొత్త ఇంటి కోసం..
రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ ఇద్దరు కూడా ఒక కొత్త ఇల్లు కోసం సెర్చ్ చేశారు. అంతకు మించి వేరే విషయాలు తనకు ఏమి తెలియవని అన్నారు. ఇకపోతే సుశాంత్ ప్రస్తుతం ఉంటున్న ఇంటి దగ్గర కొందరు లెట్ నైట్ పార్టిస్ట్ వల్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అందుకే బాంద్రాలోనే సుశాంత్ నేను కొత్త ఇంట్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు రియా చక్రవర్తి తనకు చెప్పినట్లు డీలర్ మీడియాకు వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











