నిర్మాతగా మెగాస్టార్ కూతురు.. సుస్మిత చేతికి తమిళ మూవీ రీమేక్ హక్కులు!
మెగాస్టార్ చిరంజీవి కూతురిగా క్యాస్యూమ్ డిజైనర్‌గా రాణిస్తున్న సుస్మిత కొణిదెల సినీ నిర్మాణ రంగంలోకి తన సత్తాను నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సైరా, రంగస్థలం లాంటి సినిమాలకు క్యాస్టూమ్స్ అందించి ప్రశంసలు అందుకొన్న సుస్మిత నిర్మాతగా రాణించేందుకు కృషి చేస్తున్నారు.
హాట్ హాట్ ఫోజులతో మంట పెడుతోన్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్
లాక్‌డౌన్ సమయంలో షూట్ అవుట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్‌తో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీ ఒరిజినల్‌లో ప్రసారమైన వెబ్ సిరీస్‌ను విమర్శల ప్రశంసలే కాకుండా ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొన్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ పోలీస్ అధికారులుగా నటించిన విషయం తెలిసిందే.

తాజాగా తమిళంలో హిట్ అయిన ఓ సినిమాకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. తమిళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకొన్న 8 థోట్టక్కల్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్స్, స్క్రిప్టు వర్క్‌ను ప్రారంభించే పనిలో యూనిట్ ఉన్నట్టు సమాచారం.
సుస్మిత కొణిదెల కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్నారు. అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించే ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











