హృతిక్ ‘సూపర్ 30’పై మాజీ భార్య హాట్ కామెంట్
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ నటన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రం జూలై 12 తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని ముంబైలో ఇటీవల సెలబ్రిటీలకు ప్రివ్యూ వేశారు. ఈ సందర్భంగా హృతిక్ మాజీ భార్య సుసాన్ ఖాన్ ఆసక్తికరమైన రివ్యూను వెల్లడించారు.
సూపర్ 30 సినిమా హృతిక్ కెరీర్‌లో అద్భుతమైన చిత్రంగా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు ఒక ఎత్తు.. సూపర్ 30 మరో ఎత్తు అని సుసాన్ ఖాన్ అన్నారు. ఈ సినిమా చూసి చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. హృతిక్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా మిగిలిపోతుంది. ఈ విషయం నాకు గర్వంగా ఉంది అని అన్నారు.

హృతిక్‌తో బంధంపై సుసాన్ ఖాన్ ఆసక్తిగా స్పందించారు. మా మధ్య ఓ అందమైన బంధం కొనసాగుతున్నది. మా పిల్లలు, ఆయనతో బాండింగ్ ప్రత్యేకమైనంది. మా మధ్య ప్రేమ ఎన్నడూ విద్వేషంగా మారలేదు అని సుసాన్ ఖాన్ అన్నారు.
సూపర్ 30 చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ థాకూర్ నటించగా. నందీష్ సింగ్ సంధూ, అమీత్ సాధ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











