twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్‌గా సువర్ణ సుందరి ట్రైలర్‌.. సెన్సార్‌కు సిద్ధమైన నేచురల్ థ్రిల్లర్

    |

    జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి". సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఎమ్.ఎస్.ఎన్ సూర్య తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతున్నదనే క్యాప్షన్‌ ఆసక్తిని రేపుతున్నది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్‌టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చిలొనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఇటీవ‌ విడుదలైన సువర్ణ సుందరి ట్రైలర్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే 10 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... సువర్ణ సుందరి చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది. లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది అని అన్నారు.

    Suvarna Sundari trailer goes viral, ready for censor

    సాంకేతిక పనితీరుకు నిదర్శనం మా చిత్ర ట్రైలర్ ‌కు వచ్చిన రెస్పాన్స్ . సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. మూడు జన్మల కాన్సెప్ట్‌తో హిస్టారికల్ థ్రిల్లర్‌గా తీసిన ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. మార్చి తొలివారంలో పాటలను రెండొ వారంలొ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లొ ఒకేసారి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

    Suvarna Sundari trailer goes viral, ready for censor

    జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్: ఎంఎల్‌ల‌క్ష్మి, మ్యూజిక్‌ డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌, స్టంట్స్: రామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు, డివోపి: ఎల్లుమహంతి, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి, స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పిఆర్‌ఓ: సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్: ఎమ్ఎస్‌ఎన్‌.సూర్య‌.

    English summary
    Suvarna Sundari is a socio Fantacy movie. Jaya Prada, Poorna, Sakshi Chowdary are the lead actors. Indra is introducing as hero in this movie. This movie is set to release in March Second week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X