నీ సంగతి చూస్తా? రాజేంద్రప్రసాద్‌ వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఎస్వీ కృష్ణారెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్‌గా ఆయనకు మంచి పేరుంది. కృష్ణారెడ్డి సినిమా అంటే ఇంటిల్లిపాది కూర్చొని హాయిగా తీయగలరన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి మంచి దర్శకుడే కాదు.. అంతకుమించిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తన సినిమాలకు తానే సంగీతం సమకూర్చుకునేవారు. ఆయన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే.. ఇప్పుడు విన్నా కూడా ఆ పాటలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. టైటిల్ కార్డ్స్‌‌లో కథ, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం .. ఎస్వీ కృష్ణారెడ్డిలా వేయించుకోవాలని ఎంతోమంది కలగన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే తర్వాతి రోజుల్లో ఆ స్టార్‌డమ్‌ను కృష్ణారెడ్డి కొనసాగించలేకపోయారు. యమలీల -2 తీసినా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో బుల్లితెరపై యమలీల సీరియల్‌కు రూపకల్పన చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

స్వతహాగా సౌమ్యుడు, స్నేహశిలీ అయిన ఎస్వీ కృష్ణారెడ్డికి పరిశ్రమలో అందరూ ఫ్రెండ్సే. స్నేహానికి ఆయనిచ్చే విలువ ఏంటో నిర్మాత అచ్చిరెడ్డిని అడిగితే తెలుస్తుంది. తనతో పోటాపోటీగా సినిమాలు తీసి హిట్ కొట్టిన ఈవీవీ సత్యనారాయణతోనూ కృష్ణారెడ్డి చాలా సన్నిహితంగా మెలిగేవారు. ముఖంపై చెరగని చిరునవ్వే తప్పించి ఎప్పుడూ కోపగించుకోవడం ఎరుగని కృష్ణారెడ్డి సైతం ఓ నటుడితో గొడవ పడ్డారట. ఆయనెవరో కాదు.. కృష్ణారెడ్డికి నిర్మాతగా, దర్శకుడిగా అవకాశం కల్పించిన డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఈ విషయాన్ని స్వయంగా ఎస్వీనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

sv krishna reddy made sensational commemnts on hero rajendra prasad over he rejected song in mayalodu

ఓ సందర్భంలో నువ్వు డ్యాన్సులు చేస్తావట కదా.. స్టెప్పులు వేస్తావట.. నువ్వు డైరెక్షన్ చేస్తే సినిమా ఆడేస్తుందా అంటూ రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడరని.. అవి తనను బాధపెట్టినా భరించానని కృష్ణారెడ్డి తెలిపారు. అలాగే మాయలోడు సినిమాలో చినుకు చినుకు అందెలతో అంటూ సాగే పాటను రాజేంద్రప్రసాద్, సౌందర్యలతో చిత్రీకరించాలని కృష్ణారెడ్డి ప్లాన్ చేశారు. కానీ ఆ పాట చేసేందుకు రాజేంద్రప్రసాద్ ససేమిరా అన్నారని.. అక్కడితో ఆగకుండా ఈ డేట్‌కి సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నావా, నేను ఇంకా డబ్బింగ్ చెప్పాలి అన్నారని ఎస్వీ తెలిపారు.

దీంతో భయపడ్డ తాను ముందు డబ్బింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అడగ్గా.. ఒకే ఒక్కరోజు సమయం ఇచ్చారని, పైగా గంట లంచ్ బ్రేక్ కావాలన్నారని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఒక్కరోజులో డబ్బింగ్ పూర్తి కాదని భయపడ్డానని సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వచ్చిందని, కానీ దానిని సింగిల్ రీల్‌గా మార్చానని ఆయన చెప్పారు. ఎలాగోలా రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ పూర్తయినా.. పాట గురించి అడగ్గా, తనకు కుదరదని సౌందర్య డేట్స్ ఇచ్చింది కదా చేసుకో అన్నారని తెలిపారు.

sv krishna reddy made sensational commemnts on hero rajendra prasad over he rejected song in mayalodu

అయితే ఆ సమయంలో బాబూ మోహన్‌కు గతంలో నేనిచ్చిన మాట గుర్చొచ్చి ఆయన, సౌందర్యలపై రెయిన్ సాంగ్ తీయాలని డిసైడ్ అయ్యానని అది తెలిసి రాజేంద్రప్రసాద్ మధ్యవర్తులతో రాయబారం పంపారని కృష్ణారెడ్డి చెప్పారు. బాబూ మోహన్‌కు ఇచ్చిన మాట ప్రకారం పాటను ఆయనతోనే తీశానని.. మాయలోడు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు చినుకు చినుకు సాంగ్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిందని కృష్ణారెడ్డి తెలిపారు. కానీ తాను జీవితంలో ఈస్థాయికి రావడానికి కారణం రాజేంద్రప్రసాదేనని ఆయన చెప్పడం విశేషం. ఇన్నేళ్ల తర్వాత గతేడాది ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు అనే చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X