పైట జారితే ఒప్పుకోను .. హీరోయిన్లకు కండిషన్ పెట్టిన టాప్ డైరెక్టర్
ఇటీవలికాలంలో హీరోయిన్లు ఓవర్‌గా ఎక్స్‌పోజింగ్ చేయడంపై సీనియర్ నటులు విమర్శలు చేస్తున్నారు. కుటుంబమంతా సినిమా చూసే పరిస్ధితులు కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లీన్ యూ సర్టిఫికెట్‌తో సినిమాలు వచ్చి చాలాకాలం అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడొస్తున్న సినిమాలు, హీరోయిన్ల క్లీవేజ్ షోపై హాట్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఎందరో మ్యూజిక్ డైరెక్టర్ల ఫేవరేట్ ఎస్‌వీ కృష్ణారెడ్డి
ఎస్వీ కృష్ణారెడ్డికి టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్‌గా మంచి పేరుంది. కృష్ణారెడ్డి సినిమా అంటే ఇంటిల్లిపాది కూర్చొని హాయిగా తీయగలరన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి మంచి దర్శకుడే కాదు.. అంతకుమించిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తన సినిమాలకు తానే సంగీతం సమకూర్చుకుంటూ అందరికీ షాకిచ్చారు. ఆయన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తమ ఫేవరేట్ సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డేనని చెప్పారంటే ఆయన ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు.

హీరోయిన్స్ స్కీన్ షోపై కృష్ణారెడ్డి కామెంట్స్
సినిమా టైటిల్ కార్డ్స్‌లో కథ, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం .. ఎస్వీ కృష్ణారెడ్డిలా వేయించుకోవాలని అప్పట్లో ఎంతోమంది కలగన్నారు. కారణాలు తెలియదు కానీ తర్వాతి రోజుల్లో ఆ జోరును కృష్ణారెడ్డి కొనసాగించలేకపోయారు. ఇటీవలికాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎస్‌వీ కృష్ణారెడ్డి పలు ఆసక్తికర సంగతులను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజెంట్ సినిమా మేకింగ్, హీరోయిన్స్ స్కిన్ షో గురించి కీలక విషయాలు వెల్లడించారు.
అలీ పక్కన సౌందర్య చేయనంది
యమలీల తీస్తున్నానని తెలిసి చాలా మంది హీరోలు ఇందులో కథానాయకుడిగా తాము నటిస్తామని చెప్పారని, కానీ తాను మాత్రం అలీకే ఆ క్యారెక్టర్ సెట్ అవుతుందని అన్నానని కృష్ణారెడ్డి తెలిపారు. చివరికి హీరోయిన్‌గా అలీ పక్కన సౌందర్య కూడా నటించనని తేల్చిచెప్పేసిందని ఆయన వెల్లడించారు. ఎందుకని తాను అడిగితే .. అలీ పక్కన ఎందుకు చేస్తున్నాని పెద్ద పెద్ద హీరోలు ప్రశ్నించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌందర్య తనతో చెప్పిందన్నారు. వెంటనే ఇంద్రజను హీరోయిన్‌గా సెలక్ట్ చేశానని.. తనకు అమ్మాయి ముఖం బాగుంటే చాలునని, స్ట్రక్చర్‌లు చూసి అలవాటు తనకు లేదన్నారు.
నా సినిమాలన్నీ శుద్ధి చేసినవే
హీరోయిన్ ఫిగర్ గురించి పట్టించుకున్న ఘటనలు లేవని, ఫేస్ మాత్రం చాలా ఎక్కువగా పట్టించుకుంటానని ఎస్‌వీ కృష్ణారెడ్డి అన్నారు. హావభావాలు పలికించే కళ్లు , బుగ్గలు , నవ్వు, నొసలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షిస్తానని ఆయన తెలిపారు. తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీలత, పైట కొంగు జారినా తాను ఒప్పుకోనని ఎస్‌వీ కృష్ణారెడ్డి చెప్పారు. హీరోయిన్ల పైట జారితే వెంటనే కట్ చెప్పి ఆ విషయాన్ని మరొకరి ద్వారా వాళ్లకు చెబుతానని వెల్లడించారు. తన నుంచి శుద్ధి చేసిన సినిమాలే వస్తాయని ఎస్‌వీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











