Thank You Movie: ఓటీటీలో నాగ చైతన్య సినిమా.. దిల్ రాజు టీమ్ ప్రకటనతో క్లారిటీ

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. ఆరంభంలోనే మంచి విజయాలను అందుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. అయితే, మధ్యలో వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థం చేసుకున్నాడతను. ఇలాంటి పరిస్థితుల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'మజిలీ' అనే మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ఈ యంగ్ హీరో.. ఆ వెంటనే 'వెంకీ మామ'తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' అనే చిత్రంతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు.

వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నాగ చైతన్య.. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'థ్యాంక్యూ' మూవీ ఒకటి. మనం వంటి ఫీల్‌ గుడ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయింది. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో చిత్రీకరణకు పలుమార్లు బ్రేకులు పడ్డాయి. అయినప్పటికీ వేగంగానే టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'థ్యాంక్యూ' మూవీ గురించి ఇటీవలే ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొట్టింది. అదే.. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుందన్న వార్త. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు దీన్ని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ బడా సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాకు సదరు సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ యూనిట్ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చేసింది.

SVC Clarity on Naga Chaitanyas Thank You Movie Release

నాగ చైతన్య 'థ్యాంక్యూ' మూవీ రిలీజ్ గురించి వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఖండించింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో 'థ్యాంక్యూ మూవీ ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మీ అందరికీ బిగ్ స్క్రీన్ మీద మధురానుభూతిని కలిగించేందుకు మేమంతా ఎంతో అంకిత భావంతో ఈ సినిమా పనులు చేస్తున్నాం. సమయం వచ్చినప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం. అప్పటి వరకూ వచ్చే వార్తలను ఏమాత్రం నమ్మకండి' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఓటీటీ రిలీజ్ వార్తలు అవాస్తవమని తేలిపోయింది.

ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'థ్యాంక్యూ'లో నాగ చైతన్య రెండు విభిన్నమైన గెటప్‌లతో కనిపించనున్నాడు. అంతేకాదు, ఇందులో అతడు మహేశ్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ అవికా గోర్ కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X