Swag Trailer Review: స్వాగ్ ట్రైలర్ రివ్యూ.. పురుషాంగానికి పాకులాట.. వృషణాలు వణికేలా శ్రీ విష్ణు మూవీ ట్రైలర్!
తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో రాణిస్తున్న యువ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం స్వాగ్. రాజ రాజ చోర లాంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆక్టోబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ మూవీ ట్రైలర్ రివ్యూ మీ కోసం..
ట్రైలర్‌లో చూపించిన ప్రకారం.. 1551లో మొదలైన ఈ కథలో శ్వాగనిక వంశానికి చెందిన రాజు.. ఓ ప్రెంచ్ యువతితో ఏకాంతంగా కలుస్తాడు. పక్క మీద విదేశీ యువతి తన వంశాన్ని పలకలేక స్వాగ్ అన్నారని చెప్పుకొంటాడు. ఇక ఆ వంశానికి చెందిన యవతి 1970లో ఇద్దరు కూతుళ్లతో సాధారణమైన జీవితాన్ని గడుపుతూ కనిపిస్తాడు. ఆ వంశానికి చెందిన భవభూతి, సింగ, వింజామర మధ్య డ్రామా ఆసక్తికరంగా కనిపించింది.

పిరియాడిక్ ఫ్లేవర్‌తోపాటు సమకాలీన పరిస్థితుల నేపథ్యంగా రూపొందిన స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు నాలుగు రకాల గెటప్స్‌తో విభిన్నంగా కనిపించాడు. భువభూతి క్యారెక్టర్‌లో ఆయన బాడీ లాగ్వేంజ్, డైలాగ్ డెలివరీ ఆక్టుటకొనేలా ఉన్నాయి. ఈ చిత్రంలో రీతూ వర్మ కీలక పాత్రల్లో నటించారు. మీరా జాస్మిన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నది. శరణ్య ప్రదీప్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.
తెలుగు భాషపై మంచి పట్టు ఉన్న హసిత్ గోలి రాసిన మాటలు ఈ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. పురుషాంగానికి ప్రాకులాట ఎక్కువ.. వృషణాలు వణికేలా లాంటి డైలాగ్స్ యూత్‌కు కిర్రాక్ అనిపించేలా ఉన్నాయి. సరిహద్దు దాటుతున్న మగతనంతో విర్రవీగండి అంటూ కథ ఏమిటో చెప్పకనే చెప్పారు. పితృస్వామ్యం, మాతృస్వామ్యం మధ్య జరిగే ఆధిపత్య పోరుగా కనిపించాయి.
ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. తాజాగా వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు అచ్చ తెలుగు సినిమా చూడబోతున్నారనే విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పష్టం చేసింది. ఇక సినిమాలో ఏముంది? ఎలాంటి అనుభూతిని పొందబోతున్నామనే విషయం కోసం అక్టోబర్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
నటీనటులు: శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవి బాబు, గెటప్ శ్రీను గోపరాజు రమణ తదితరులు
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
రచన, దర్శకత్వం: హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
మ్యూజిక్: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్
స్టంట్స్: నందూ మాస్టర్
కొరియోగ్రఫి: శిరీష్ కుమార్
రిలీజ్ డేట్: 2024-10-04


Click it and Unblock the Notifications











