Project K ఆలస్యమయ్యేది అందుకే.. ప్రాజెక్ట్ కె అసలు టైటిలా? స్వప్న దత్ కీలక విషయాలు
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ప్రభాస్ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొనగా, మూవీ నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా విషయాలను స్వప్న దత్ తెలిపారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి, రాజకుమారుడు, స్టూడెంట్ నెంబర్ 1, ఇంద్ర, దేవదాస్, మహానటి, సీతా రామం వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందింది. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోన్న నేపథ్యంలో ఈ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మక రూపొందిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్ట్రార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.

అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ప్రాజెక్టె కె మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగినట్లుగానే మూవీలో నటీనటులు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉంటున్నాయి. ఇటీవలే ప్రాజెక్ట్ కె విడుదల తేదిని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ మైండ్ బ్లోయింగ్ లా ఉంది. అలాగే స్క్రాచ్ వీడియో 2 అంటూ ప్రాజెక్ట్ కెలోని విలన్స్ ఎలా ఉంటారో వీడియోలో చూపించారు. వచ్చే ఏడాది జనవరి 12న వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను స్వప్న దత్ వెల్లడించారు.
ప్రాజెక్ట్ కె చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికీ 70 శాతం పూర్తయింది. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నాయి. ప్రాజెక్ట్ కె ఎక్కువ గ్రాఫిక్స్ తో కూడుకును ఉంటుంది. అందుకే సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసినప్పటికీ వీఎఫ్ఎక్స్ కు చాలా సమయం పడుతుంది. సినిమా షూటింగ్ తో పోల్చితే గ్రాఫిక్స్ పనులకే ఎక్కవ సమయం పట్టే అవకాశం ఉంది అని స్వప్న దత్ చెప్పుకొచ్చారు.

ఇక ప్రాజెక్ట్ కె అనేది వర్కింగ్ టైటిలా.. అసలు పేరా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేశారు స్వప్న దత్. అవసరం అయినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె యాక్షన్ సీక్వెన్స్ లను పర్యవేక్షించడానికి నలుగురైదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చినట్లు ఇటీవల అశ్వనీదత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











