బాలీవుడ్‌లో మరో బ్రేకప్.. విహార యాత్రలో టార్చర్ అంటూ..
బాలీవుడ్‌లో మరో జంట బ్రేకప్ చెప్పేసుకొన్నారు. గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న హీరోయిన్ స్వర భాస్కర్, హిమాంన్షు శర్మ విడిపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. అయితే మీడియా కథనాలకు భిన్నంగా వారిద్దరూ విహారయాత్రకు వెళ్తూ ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించడం షాకిచ్చింది. తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోను కూడా స్వర భాస్కర్ షేర్ చేసింది.
నీ గర్ల్‌ఫ్రెండ్ బలవంత చేస్తే తప్పకుండా సెల్ఫీకి ఫోజు ఇవ్వాల్సిందే. విహారయాత్రలో టార్చర్.. టార్చర్‌తో కూడా సెలవులు అని హిమాంన్షు ట్వీట్ చేశారు. స్వరభాస్కర్, హిమాంన్షు ఇద్దరు తను వెడ్స్ మను సినిమా షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వారిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఆ సినిమాకు హిమాంన్షు స్క్రిప్టును అందించిన సంగతి తెలిసిందే.

స్వర, హిమాంన్షు విడిపోయారు. వారిద్దరూ గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వారి బ్రేకప్ ఇటీవలే జరిగింది. కానీ ఇంకా వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు అని ప్రముఖ పత్రిక కథనంలో పేర్కొన్నది.
హిమాంన్షుతో పెళ్లి గురించి ప్రశ్నించగా.. నేను పెళ్లి గురించి ఆలోచించడం లేదు. పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధంగా లేను. పెళ్లి చేసుకోనేంత హాయిగా స్వరభాస్కర్ లేదని చెప్పండి. ప్రస్తుతం కేవలం కెరీర్ మీదే దృష్టిపెట్టాను. పెళ్లి గురించి తొందర పడటం లేదు. పెళ్లి వార్తలన్నీ అవాస్తవం. చెత్త వార్తలన్నీ విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి అని అన్నారు. స్వరభాస్కర్ తాజాగా వీర్ దీ వెడ్డింగ్, జీరో సినిమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











