ఆ వారసుడికి అవకాశం ఇచ్చిన చిరంజీవి: ఆచార్యకు ఆయన.. భోళా శంకర్ కోసం ఈయన

సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోగా ఎదిగిపోయారాయన. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అలా చాలా గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి ఆయన ఫుల్ జోష్‌తో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ పట్టాలపై ఉండగానే.. ఆయన మరో మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమాను చేస్తున్నారు. ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు.

Swara Sagar Mahathi Fix for Chiranjeevis Bholaa Shankar

ఇక, చిరంజీవి ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది 'భోళా శంకర్'. దీనికి కారణం ఈ మూవీని ఫ్లాప్ దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండడమే. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందనున్న ఈ సినిమాలో హీరో సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇక, ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ షూట్ కూడా పూర్తి చేశాడట. అలాగే, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'భోళా శంకర్' మూవీ నుంచి దసరా పండుగ రోజు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణి శర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించబోతున్నాడట. ఈ విషయాన్నిచిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, దర్శకుడు మెహర్ రమేష్.. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ కూడా ఇప్పటికే మొదలైందని పేర్కొంటూ ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. చిరు ప్రస్తుతం చేస్తోన్న 'ఆచార్య'కు మణి శర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. 'భోళా శంకర్'కు ఆయన వారసుడికి ఛాన్స్ దొరకడం విశేషం.

క్రేజీ కాంబినేషన్‌లో రానున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి టాక్సీ డ్రైవర్‌గా గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇది ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X