ఎస్ఎస్.రాజమౌళి - రజనీకాంత్ కాంబినేషన్.. ఇద్దరు మాట్లాడుకున్నారు కూడా: సై నిర్మాత

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా చేసిన తర్వాత స్టార్ హీరోలందరితో సినిమా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. స్టార్ ఇమేజ్ ఉంటే ఆయన ఎవరితోనైనా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. తన సినిమాలకు ఎంత కథాబలం ఉన్న కూడా తప్పనిసరిగా హీరో స్టార్ ఇమేజ్ అనేది చాలా అవసరం అని కూడా చాలాసార్లు చెప్పారు. ఇక రజనీకాంత్ తో సినిమా చేయడానికి రాజమౌళి ఒకసారి గట్టిగానే ప్రయత్నాలు చేశారట. ఇటీవల సై నిర్మాత A భారతి ఆ కాంబినేషన్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు.

రాజమౌళిని పక్కన పెట్టారు..

రాజమౌళిని పక్కన పెట్టారు..

సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అగ్ర దర్శకునిగా గుర్తింపు పొందుతున్నా రాజమౌళితో సినిమా చేసేందుకు ఎలాంటి స్టార్ హీరో అయినా సరే సిద్ధంగా ఉంటారు. అయితే ఒకప్పుడు మాత్రం రాజమౌళి చాలా మంది స్టార్ హీరోల చుట్టూ తిరిగినప్పుడు వారు ఎవరూ కూడా అంతగా లెక్కచేయలేదు. కథ నచ్చలేదని, అలాగే సరైన న్యాయం చేయగలడో లేదో అని కూడా కొంతమంది రాజమౌళి ని పక్కన పెట్టిన వారు కూడా ఉన్నారు.

సై నిర్మాత..

సై నిర్మాత..

ఇక రాజమౌళి సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో కూడా ఆ మధ్య కాలంలో సినిమా రాబోతున్నట్లు మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అసలైతే అవన్నీ రూమర్స్ అని చాలామంది అనుకున్నారు. కానీ అది నిజమే. సై సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపును అందుకున్న ఏ భారతి ఈ కాంబినేషన్ ను కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.

నితిన్ ను కాదని..

నితిన్ ను కాదని..

ఇటీవల ఏ భారతి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి మాట్లాడుతూ సై సినిమా విమర్శకుల ప్రశంసలు బాగానే అందుకుందని, కానీ కమర్షియల్ గా మాత్రం సినిమా అనుకున్నంతగా లాభాలను అందించలేకపోయిందని అన్నారు. అంతేకాకుండా ఆ మూవీ వల్ల పెద్దగా నష్టాలు కూడా ఏమీ రాలేదు.. ఆ సినిమా జస్ట్ అలా ఆడింది అని తెలియజేశారు. ఇక నిర్మాత మొదట సై సినిమాకు నితిన్ అనుకోలేదట ఇతర స్టార్ హీరోలకు కూడా సంప్రదించినట్లు గా వివరణ ఇచ్చారు.

రజనీకాంత్ తో సినిమా

రజనీకాంత్ తో సినిమా

ఇక సై సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో దర్శకుడు రాజమౌళి చాలా సార్లు తనతో మరో సినిమా చేయాలని అనుకున్నారు. విక్రమార్కుడు చత్రపతి మగధీర వంటి భారి సినిమాలను తెరకెక్కించిన తర్వాత పెద్ద హీరోతో సినిమా చేస్తే బాగుంటుంది అని రాజమౌళికి చెప్పాను. అందుకోసం రజినీకాంత్ అయితే బాగుంటుంది అని కూడా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు.

Recommended Video

Pawan Pawan Fans Angry On SS Rajamouli Tweets | Filmibeat Telugu
అందుకే అలా క్యాన్సిల్ అయ్యింది..

అందుకే అలా క్యాన్సిల్ అయ్యింది..

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తాను కలిసి రజనీకాంత్ తో సినిమా చేయాలనీ అనుకున్నాం. అలాగే రాజమౌళితో కూడా కలిసి మాట్లాడటం జరిగింది. ఒక రెండు మూడు నెలల్లో ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి అని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆలస్యం కావడంతో ఎందుకో ధైర్యం చేయలేక పోయాను అని భారతి తెలియజేశారు. అలాగే రత్నం పరిస్థితి కూడా అప్పట్లో అంతంతమాత్రంగానే ఉండటంవల్ల చేయకూడదు అని వెనక్కి తగ్గినట్లుగా వివరణ ఇచ్చారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X