అభిమానులు సంబరపడే న్యూస్... ‘సైరా’లో పవన్ కళ్యాణ్ భాగమయ్యారు!

చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ మూవీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మెగాస్టార్ కెరీర్లో ఇది 151వ చిత్రం. అంతే కాదు ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటికంటే పెద్ద బడ్జెట్ ఇదే. చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని తన సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి.

సైరా మేకింగ్ వీడియో

సైరా మేకింగ్ వీడియో

సినిమా ప్రమోషన్లో భాగంగా సైరా మేకింగ్ వీడియో ఆగస్టు 14న మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్టును ఎలా రూపొందించారు, ఈ మూవీ కోసం ఎంత మంది కష్టపడ్డారు అనేది ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు వివరించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్

పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్

మేకింగ్ వీడియోలో ఓ ప్రత్యేకత ఉందని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో మొదలవుతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

యువత తప్పకుండా చూడాల్సిన సినిమా

యువత తప్పకుండా చూడాల్సిన సినిమా

‘‘దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ప్రతి ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ ఈ చిత్రం ఉంటుంది. ఇది యువత తప్పకుండా చూడాల్సిన సినిమా'' అని మెగాస్టార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సైరా నరసింహా రెడ్డి

సైరా నరసింహా రెడ్డి

1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించారు. ఇందు కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు అంచనా. ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా'ను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X