‘సైరా’ న్యూ పోస్టర్: గుర్తుపట్టలేని విధంగా జగపతి బాబు లుక్..

Recommended Video

Jagapathi Babu look As Veera Reddy From Sye Raa | Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఆగస్టులో విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. స్పెషల్ అకేషన్స్ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్ విడుదల చేస్తూ చిత్ర బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా సైరాలో ఆయనకు సంబంధించిన లుక్ వదిలారు.

వీరా రెడ్డిగా జగపతి బాబు

‘సైరా'లో జగపతి బాబు వీరారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఉయ్యాలవాడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆయనకు సపోర్టుగా జగపతి బాబు పాత్ర ఉంటుందని తెలుస్తోంది. తాజాగా విడుదదలైన లుక్ జగ్గూభాయ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎవరూ గుర్తుపట్టలేని విధంగా...

ఎవరూ గుర్తుపట్టలేని విధంగా...

భారీగా గడ్డం, పొడవాటి జుట్టుతో జగపతి బాబు లుక్ ఎవరూ గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఆయన పాత్ర తలపాగా చూస్తుంటే... రాజరికపు పాత్రలో లేదా అధికారి పాత్రలో కనిపిస్తారనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే..

రిలీజ్ ఎప్పుడంటే..

సినిమా ఓవరాల్ షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా డెడ్ లైన్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, అయితే షూటింగ్ వేర్వేరు లొకేషన్లలో ఉండటంతో అనుకున్న సమయంలో చిత్రీకరణ పూర్తి చేయడం కోసం యూనిట్ చాలా కష్టపడాల్సి వస్తోందట. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X