కేరళ కదన రంగానికి సైరా.. భారీ ఎత్తున మెగాస్టార్‌తో యాక్షన్ ఎపిసోడ్స్
టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నర్సింహరెడ్డి శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొన్నది. మరికొన్ని యాక్షన్ సీన్లను, ఎపిసోడ్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ కేరళకు సిద్దమయ్యారు. సినిమాకు కీలకంగా మారే ఈ సన్నివేశాల్లో ప్రధాన తారలలతో పాటు ఇతర నటీనటులు పాల్గొంటారు.
ఏప్రిల్ చివరి వారంలో సైరా షూటింగ్ కోసం కేరళకు వెళ్తున్నాం. తిరిగి వచ్చిన తర్వాత మే నెలలో హైదరాబాద్‌లో మిగితా సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దాంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. భారీ ఎత్తున వీఎఫ్ఎక్స్ పనులను పూర్తి చేసి అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా చిత్రం దాదాపు రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో హీరో రాంచరణ్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, బ్రహ్మాజీ, నయనతార కీలక పాత్రలను పోషిస్తున్నారు.
సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











