న్యూయార్క్ సిటీలో తమన్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా సడెన్‌గా న్యూయార్క్ సిటీలో దర్శనమిచ్చింది. ఏ సందర్భంపై అక్కడికి వెళ్లిందో తెలియదు కానీ అక్కడ ఆమె దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యెల్లో చెక్స్ ఉన్న దుస్తులు ధరించిన ఈ భామ సిటీకే కొత్త అందాన్ని తెచ్చింది.
టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించిన తమన్నాకు 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం మరో చారిత్రాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి'లో నటిస్తోంది తమన్నా. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో నాట్యకారిణిగా కనిపించి ఆకట్టుకుంది తమన్నా. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో తమన్నా రోల్ చాలా చిన్నది అని వార్తలు వచ్చాయి. కానీ ట్రైలర్ లో కనిపించిన సీన్స్‌ని బట్టి చూస్తే ఈ సినిమాలో తమన్నా రోల్ చాలా ముఖ్యమైందని తెలుస్తోంది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











