నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అదే.. సీక్రెట్ చెప్పిన 'సైరా' డైరెక్టర్

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాకి సంబందించి, తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు విశేషాలు పంచుకున్నాడు. ఆ వివరాలు చూస్తే..

దేశభక్తి చాటేలా హైలైటెడ్ సీన్స్

దేశభక్తి చాటేలా హైలైటెడ్ సీన్స్

'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, రెండు ట్రైలర్స్ విడుదల చేసిన సైరా యూనిట్.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ వీడియోల్లో చూపించిన సన్నివేశాల్లో దేశభక్తి ఉట్టిపడింది. పరాయి దేశం వాళ్లకు చుక్కలు చూపించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పౌరుషాన్ని ఓ రేంజ్ లో చూపించారు.

దేశభక్తి గురించి స్పందించిన డైరెక్టర్

దేశభక్తి గురించి స్పందించిన డైరెక్టర్

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో దేశభక్తి గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సురేందర్ రెడ్డి. ఆర్‌ఎస్‌ఎస్ వల్లనే తనకు దేశభక్తి, క్రమశిక్షణ పెరిగిందని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి తాను పెరిగిన విధానం, అలవర్చుకున్న క్రమశిక్షణ గురించి కొన్ని విషయాలు చెప్పారు సురేందర్ రెడ్డి.

చిన్నప్పటి నుంచి అక్కడే.. అందుకే

చిన్నప్పటి నుంచి అక్కడే.. అందుకే

తాను చిన్నప్పటి నుంచే సరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్నానని, అది ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడిచేదని అన్నారు సురేందర్ రెడ్డి. ఆ స్కూల్‌లోని పరిస్థితులు తనలో దేశభక్తి, గౌరవం, క్రమశిక్షణ అలవర్చాయని చెప్పారు. స్కూళ్లో నేర్పిన సంస్కారమే తనను ఈ స్థాయి దాకా తీసుకొచ్చి డైరెక్టర్‌ను చేసిందని అన్నారు సురేందర్ రెడ్డి. ఆ రోజు నేర్చుకున్న ఆ పాఠాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని సీక్రెట్ చెప్పేశారు.

అప్పటి పరిస్థితులను అద్దంపట్టేలా..

అప్పటి పరిస్థితులను అద్దంపట్టేలా..

ఆనాటి పరిస్థితులను అద్దంపట్టేలా అద్భుతమైన సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి రూపొందించారు సురేందర్ రెడ్డి. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి నటించగా, ఆయన భార్య పాత్రలో నయనతార నటించింది. మరో హీరోయిన్ తమన్నా ముఖ్య పాత్ర పోషించింది. అనుష్క కూడా నటించిందని టాక్. కాకపొతే ఆమె పాత్రను సీక్రెట్‌గానే ఉంచారు.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X