‘సైరా’ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ నిర్మిస్తున్న'సైరా నరసింహారెడ్డి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రం రిలీజ్ విషయంలో చాలా కాలంగా సందిగ్దత నెలకొని ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ 'సైరా' రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పక్కాప్లానింగ్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూ వెళుతున్నట్లు చెప్పారు.
సినిమా ఓవరాల్ షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా డెడ్ లైన్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, అయితే షూటింగ్ వేర్వేరు లొకేషన్లలో ఉండటంతో అనుకున్న సమయంలో చిత్రీకరణ పూర్తి చేయడం కోసం యూనిట్ చాలా కష్టపడాల్సి వస్తోందట.

చిత్ర బృందం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... కొన్ని సీన్లు రాజస్థాన్‌లోని కోటల్లో, మరికొన్ని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్లలో చిత్రీకరించాల్సి ఉందట. ఈ పని పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ మొదలవుతుంది.
కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











