సైరా చెదరని కల.. మహానటులు వదిలేస్తే చిరంజీవికి: పరుచూరి

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే వేదిక వద్ద వాతావరణం కోలాహాలంగా మారింది.

సైరా నర్సింహారెడ్డి సినిమా కథ పదేళ్ల కల. కల ఎప్పుడూ చెదిరిపోదు. కల కలగానే మిగిలిపోతుంది. కల చెదిరిపోకుండా నిలచిపోయినట్టే.. చిరంజీవి ఇంకా యువకుడిగా కనిపించడం మన అదృష్టం. ఈ సినిమా స్వాతంత్ర్య పోరాటం. న్యాయంగా చిరంజీవి కోసం చాలా మంది నటులు వదిలేసినట్టు నేను అనుకొంటాను. చాలా మంది వదిలేసిన తర్వాత చిరంజీవికి కథ చెబితే చేస్తానన్నారు. అందుకోసమే మేము ఎన్నో ఏళ్లుగా వేచి చూశాం అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.

Sye Raa Narasimha Reddy pre release event: Parchuri Venkateshwar Rao speech

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథను చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ అద్బుతంగా తెరకెక్కించారు. తన తండ్రిని ఎక్కడో నిలబెట్టడానికి కంకణం కట్టుకొన్నాడు. ఈ సినిమా గాంధీ గారి పుట్టినరోజున అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గాంధీ పై నుంచి ఆశీస్సులతో సైరా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని పరుచూరి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X