twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరికైనా సక్సెస్ వస్తే ఈర్షపడం.. రాజమౌళికి రికార్డు బద్దలు కొడితే.. పవన్ కల్యాణ్

    |

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

    సైరా వేడుకలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై పవన్ కల్యాణ్ ప్రశంసలతో ముంచెత్తారు. భారత దేశం గర్వించదగిన దర్శకుడు అని అన్నారు. అలాంటి వ్యక్తి ఈ వేడుకకు రావడం నిజంగా అభినందనీయమని అభిప్రాయపడ్డారు.

    Sye Raa Narasimha Reddy pre release event: Pawan Kalyan praises SS Rajamouli

    మాకు మా అన్నయ్య నేర్పిన గొప్ప విషయం ఏమిటంటే.. అందరూ బాగుండాలని కోరుకొనే మనస్తత్వం. అందుకే ఎవరు గెలిచినా.. విజయం సాధించినా సంతోషపడుతాం అని పవన్ కల్యాణ్ ఉద్వేగంగా మాట్లాడారు. అందుకే ఎవరైనా విజయం సాధిస్తే బాధపడం, ఈర్షపడం. వారు విజయం సాధిస్తే మేము ఆనందపడుతాం ఎందుకంటే వారి చుట్టుపక్కన ఉండే వారు సంతోషంగా ఉంటారనేది మా నమ్మకమన్నారు.

    తెలుగు సినిమా గొప్పతనాన్ని, తెలుగు సినిమా ఖ్యాతిని దేశాన్ని కాకుండా అంతర్జాతీయంగా దాటించిన ఎస్ఎస్ రాజమౌళి రావడం హ్యాపీగా ఉంది. రాజమౌళి రికార్డులు బద్దలు కొట్టినా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే సురేందర్ రెడ్డి విజయం సాధించినా సంతోషం పడుతాం అని పవన్ కల్యాణ్ అన్నారు.

    దేశం కోసం తీసిన చిత్రం సైరా.. భారతీయులు గర్వించేలా సినిమా తీసినా ప్రతీ ఒక్కరికి, సాంకేతిక నిపుణులు ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక పవన్ ప్రసంగం ముగిసిన వెంటనే చిరంజీవి ఆయనను కౌగిలించుకొని వెన్ను తట్టారు.

    English summary
    Sye Raa pre release event: Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy pre release event is orgnaised at LB Stadium of Hyderabad. Jana Sena Chief Pawan Kalyan, Koratala Siva, VV Vinayak are the guest for the evening. This movie is releasing on october 2nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X