ఇండియన్ సినిమాలోనే సరికొత్త పేజీకి శ్రీకారం.. సైరాలో ఎవరెవరు ఏయే పాత్రలో అంటూ యాంకర్ సుమ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్‌బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తూ సైరా విశేషాలు చెబుతోంది. ఈ మేరకు సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఎవరెవరు ఏయే క్యారెక్టర్స్ చేస్తున్నారో తెలిపింది సుమ.

Sye Raa Narasimha Reddy pre release event: Suma says Sye Raa Charecters

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, గోసాయిగా వెంకన్నగా అమితాబ్ బచ్చన్, సిద్దమ్మగా నయనతార, లక్ష్మీగా తమన్నా, అవుకురాజుగా కిచ్చ సుదీప్, రాజాపాండీగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, వసి రెడ్డిగా రవి కిషన్ నటిస్తున్నారని, ఇంతమంది తారాగణంతో ఇండియన్ సినిమాలోనే సరికొత్త పేజీకి శ్రీకారం చుట్టింది సైరా నరసింహా రెడ్డి అంటూ తన మాటలతో వేదిక ప్రాంగణాన్ని హోరెత్తించింది యాంకర్ సుమ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X