‘సైరా’లో... విజయ్ సేతుపతి లుక్ ఇదే, ఏ పాత్రలో అంటే...

Recommended Video

Sye Raa Narasimha Reddy :Vijay Sethupathi's New Look Revealed | Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న పీరియడ్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'లో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ సేతుపతి పాత్ర, లుక్ రివీల్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' మోషన్ పోస్టర్ విడుదల చేసింది.

విజయ్ సేతుపతి పుట్టినరోజు నేడు(జనవరి 16). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఈ రోజు 40వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో విజయ్ రాజా పాండి అనే పాత్రలో కనిపించబోతున్నారు.

రాజా పాండి

విజయ్ సేపతుపతి పోషిస్తున్న రాజా పాండి లుక్ పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారు. జులపాల జుట్టు, మెడలో పులిగోరు, చేతిలో కత్తితో ఒక యోధుడిలా అతన్ని ప్రజంట్ చేశారు.

కీలక పాత్రల్లో...

కీలక పాత్రల్లో...

ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తుండగా అతడి భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార, గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్, లక్ష్మీ అనే పాత్రలో తమన్నా, అవుకు రాజు పాత్రలో కిచ్చా సుదీప్ నటిస్తున్నారు.

ఉయ్యాలవాడ చరిత్ర

ఉయ్యాలవాడ చరిత్ర

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ ఇది. ఇలాంటి ఒక పీరియడ్ డ్రామాలో మెగాస్టార్ నటించడం ఇదే తొలిసారి.

ఆగస్ట్ రిలీజ్

ఆగస్ట్ రిలీజ్

‘సైరా' ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 15న సాహో రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అయితే లాంగ్ హాలిడే వీకెండ్ ఉండటంతో ఇదే రోజు విడుదల చేస్తారా? వారం గ్యాపుతో రిలీజ్ అవుతుందా? అనేది ఫైనల్ కాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X