Sye Raa Narasimhaa Reddy Pre Release:భారీ హోర్డింగ్స్.. జన సందోహం.. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

పోటెత్తిన అభిమాన వర్గం
హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వస్తోంది. ఇప్పటికే వేలాది మంది చిరంజీవి అభిమానులు పోటెత్తారు. ప్రస్తుతం స్టేడియంలో సందడి వాతావరణం కనిపిస్తోంది.

భారీ ఏర్పాట్లు.. హై సెక్యూరిటీ
ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజానీకానికి హై సెక్యూరిటీ కల్పించారు. వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ వేడుక భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది.

ముఖ్య అతిథిగా పవన్.. భారీ హోర్డింగ్స్
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్న నేపథ్యంలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ హోర్డింగ్స్ చూసి మురిసిపోతున్నారు మెగా అభిమానులు. వేదిక దద్దరిల్లేలా మెగాస్టార్ అంటూ కేకలు పెడుతున్నారు మెగా అభిమానులు.

మెగా సముద్రం
ప్రస్తుతం ఎల్‌బీ స్టేడియం ప్రాంగణమంతా మెగా సముద్రంగా మారింది. సందడి సందడిగా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. అంగరంగ వైభవంగా చేసిన ఈ ఏర్పాట్లు చూస్తుంటే ఈ రోజు మెగా అభిమానులకు కనువిందు ఖాయం అని తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ఈవెంట్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











