సైరా హక్కులను సొంతం చేసుకున్న టెలివిజన్ నెట్‌వర్క్ ఇదే.. మెగా సందడి ఆ తెరపైనే

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' పైనే ఉంది. మెగా అభిమానులతో పాటు అశేష ప్రేక్షకలోకం సైరా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ఆతృతను రెక్కలు కట్టేలా సైరా నుంచి వస్తున్న ఒక్కో అప్‌డేట్ మరింత రక్తి కట్టిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలుకొని థియేటర్స్ కౌంట్ వరకూ అన్నీ హైలైట్‌గా నిలుస్తున్నాయి.

తాజాగా సైరా నరసింహా రెడ్డి హక్కులను జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు జెమినీ టీవీతో భారీ డీల్ జరిగిందని సమాచారం. అయితే తాము సైరా హక్కులను సొంతం చేసుకున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు జెమినీ టీవీ వారు. ''చిరంజీవి, నయనతార, తమన్నా నటించిన సైరా యొక్క హక్కులను జెమిని టీవీ సొంతం చేసుకుంది'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. సో బుల్లితెర సైరా సందడి జెమినీ టీవీలోనే చుడనున్నామన్నమాట.

Sye Raa Narasimhaa Reddy Rights Acquired By Gemini Tv

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X