ముదురుతున్న సైరా వివాదం.. 8 కోట్లు కావాలంటూ చరణ్‌పై ఒత్తిడి!

Recommended Video

Uyyalawada Family Demands Huge Amount From Ram Charan? | Filmibeat Telugu

రాయలసీమ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. రామ్ చరణ్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే అనుకోని అవాంతరాలు వెంటాడుతూ చిత్రయూనిట్‌కి తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రామ్ చరణ్ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ కుటుంబీకులు చేసిన హంగామా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు 8 కోట్లు కావాలంటూ ఉయ్యాలవాడ వంశస్థుల డిమాండ్ నడుస్తోందట. ఇంతకీ ఎం జరిగింది? ఉయ్యాలవాడ కుటుంబీకులు ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు? వివరాల్లోకి పోతే..

కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ ఎదుట ఆందోళన

కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ ఎదుట ఆందోళన

మా రక్తంతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. సినిమా కథ విషయంలో తమకు హక్కులు ఉంటాయని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు డిమాండ్ చేయగా.. కొణిదెల ప్రొడక్షన్స్, ఉయ్యాలవాడ కుటుంబీకుల మధ్య గతంలో ఓ అగ్రిమెంట్ జరిగిందని తెలిసింది.

రామ్ చరణ్ మాటిచ్చాడు గానీ చివరకు

రామ్ చరణ్ మాటిచ్చాడు గానీ చివరకు

సైరా కథ హక్కుల విషయమై ఉయ్యాలవాడ కుటుంబీకులతో బాండ్ రాయించుకున్న కొణిదెల టీమ్.. ముందుగానే వారికి కాంపెన్సేషన్ ఇస్తామని తెలిపారట. ఈ మేరకు వారికి రామ్ చరణ్ కూడా స్వయంగా మాటిచ్చారట. ఈ నేపథ్యంలో షూటింగ్ నిమిత్తమై తమ ఆస్తులు, పొలాలు వాడుకొని.. తీరా రిలీజ్‌కి ముందు కాంపెన్సేషన్ విషయంలో సైరా టీమ్ ముఖం చాటేస్తోందని ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.

ఆరోపణల్లో నిజానిజాలేంటి? అసలేం జరిగింది?

ఆరోపణల్లో నిజానిజాలేంటి? అసలేం జరిగింది?

అయితే ఉయ్యాలవాడ కుటుంబీకులు చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలేంటి? అసలేం జరిగింది? అనే దానిపై తాజాగా కొన్ని ఆసక్తికర సంగతులు బయటకు వచ్చాయి. తొలుత రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం లక్షల్లో డబ్బు చెల్లించేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ టీమ్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబీకులకు మాటిచ్చిందట. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కనబెట్టి ఏకంగా 8 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలంటూ చెర్రీ పై ఒత్తిడి తెస్తున్నారట ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్. అయితే అంత కాంపెన్సేషన్ ఇవ్వలేమని కొణిదెల టీమ్ చెప్పడంతో వివాదం బాగా ముదిరిందని తెలుస్తోంది.

మున్ముందు వివాదం సద్దుమనిగేనా.. లేక!

మున్ముందు వివాదం సద్దుమనిగేనా.. లేక!

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 2 న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా ఉయ్యాలవాడ కుటుంబీకులు వివాదం సృష్టించడంతో.. రిలీజ్ సమయానికి ఈ వివాదం సద్దుమనుగుతుందా? లేక ఇంకా ముదురుతుందా? అనేది టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X