twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా 'సైరా' బిజినెస్.. ఒక్క తెలుగు వర్షన్ లోనే ఇదీ రేంజ్

    |

    విడుదలకు ముందే సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సైరా. ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయేలా ఉన్నాయి సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.

    తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది సైరా నరసింహా రెడ్డి సినిమా. అయితే ఒక్క తెలుగు వర్షన్ లోనే దాదాపు ఈ సినిమాకు సంబంధించి 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 108 కోట్ల బిజినెస్ జరిగగా.. విదేశాల్లో తెలుగు రైట్స్ కలిపితే ఈ మార్క్ 150 కోట్లకు చేరిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

    Sye Raa pre release business update.. In only Telugu Version

    మరోవైపు కన్నడలో కూడా సైరా నరసింహా రెడ్డి దూకుడు మామూలుగా లేదు. అక్కడ ఏకంగా 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సైరా. ఇక ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన కారణంగా హిందీ వర్షన్ లో కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తానికి విడుదలకు ముందే దేశవ్యాప్తంగా కళ్లుచెదిరే బిజినెస్ చేసింది సైరా.

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి హై రేంజ్‌లో రూపొందించారు. చిత్రంలో అమితాబ్ బచ్చన్, తమన్నా నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy movie creating sensations before release. As per latest talk this movie pre release event will be very much grandly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X