twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా నరసింహా రెడ్డి’ రిలీజ్ సంక్రాంతికి మారిందా?

    |

    తెలుగు సినీ ప్రేక్షకులు 2019లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' ఒకటి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించారు. ఈ మూవీ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు అంచనా. అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం వెల్లడించింది. అయితే రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.

    ఈ సినిమాకు సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

    Sye Raa release postponed to Sankranthi season?

    సైరా' చిత్రంలోని విజువల్స్ వరల్డ్ క్లాస్‌‌లా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ ఖర్చవుతున్నా... క్వాలిటీ విషయంలో తేడా రాకుండా చూడాలని నిర్మాత చరణ్ ఆల్రెడీ తన టీంకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందు కోసం విదేశీ టెక్నిషన్ సహాయం తీసుకుంటున్నారట.

    ప్యాన్ ఇండియా మూవీగా 'సైరా'ను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో భారీ తారాగణం ఎంపిక చేశారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈ చిత్రం భారీగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Sye Raa makers are in plans to release the film during the Sankranthi season as the CG work has not been completed. An official confirmation is yet to be received.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X