ఆ పాత్రలో మీరు అద్భుతం.. అమితాబ్‌కు ఫాల్కే అవార్డుపై 'సైరా' యూనిట్ ప్రశంసల వర్షం
బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కి దక్కిన అరుదైన గౌరవం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై సైరా నరసింహా రెడ్డి యూనిట్ స్పందించింది. బాలీవుడ్ మెగాస్టార్‌కి అభినందనలు తెలుపుతూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ వారు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు. ఆయనకు దక్కిన ఈ గౌరవంపై ఆనందం వ్యక్తం చేశారు.

తొలి టాలీవుడ్ సినిమా
భారతీయ సినీ పరిశ్రమకు గత 50 ఏళ్లుగా సేవలందిస్తున్న అమితాబ్.. తొలిసారి టాలీవుడ్ గడప తొక్కుతున్నారు. చిరంజీవి హీరోగా రాబోతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయి ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ తరుణంలో అమితాబ్‌కి దక్కించుకున్న దాదా సాహెబ్ ఫాల్కే సన్మానం పట్ల ఖుషీ అవుతోంది చిత్రయూనిట్.
సైరా టీమ్ ప్రత్యేక అభినందనలు
ఈ మేరకు సైరా టీం తరఫున అమితాబ్ బచ్చన్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు. ''ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న లెజెండ్ అమితాబ్ గారికి ప్రత్యేక అభినందనలు. సైరా మీరు గోసామి వెంకన్న పాత్రలో నటించడం పట్ల గౌరవంగా ఫీల్ అవుతున్నాం'' అని ట్వీట్ చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా స్పందిస్తూ అమితాబ్ బచ్చన్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్, ట్రైలర్ సెన్సేషన్
సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ వీడియోల్లో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకలోకాన్ని అబ్బురపరిచాయి. దీంతో సైరా టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపాయి. సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆత్రుత రెట్టింపయింది.


Click it and Unblock the Notifications











