twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా 150 చిత్రాలు ఓఎత్తు.. సైరా మరో ఎత్తు.. తమన్నా నా కంటే గ్రేట్.. చిరంజీవి

    |

    Recommended Video

    Chiranjeevi Speech At Sye Raa Narasimha Reddy Success Meet | మహేష్ బాబు,రాజమౌళి కి చాలా నచ్చింది!!

    మెగాస్టార్ 151వ చిత్రం సైరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను చూరగొంటున్న నేపథ్యంలో నిర్మాత రాంచరణ్ గురువారం (అక్టోబర్ 3న) థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ సినిమా సినీ పరిశ్రమకు దసరా పండుగను ముందే తెచ్చిదంటూ ప్రశంసలు వెల్లవడుతున్న నేపథ్యంలో చిరంజీవి భావోద్వేగంలో మునిగిపోయారు. ఈ థ్యాంక్యూ మీట్‌లో చిరంజీవి, రాంచరణ్, జగపతి‌బాబు, తమన్నా, బుర్రా సాయిమాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..

    12 ఏళ్ల కల సాకారమైంది

    12 ఏళ్ల కల సాకారమైంది

    సైరా కంటే ముందు ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చేయాలి. నా కెరీర్ బెస్ట్ పాత్ర కావాలి. భగత్ సింగ్ లాంటి పాత్రను చేయాలనే కోరికతో ఉన్నాను. ఆ క్రమంలో పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కాకపోతే బడ్జెట్ సమస్య మాకు ఎదురైంది. భారీ బడ్జెట్‌తో తీస్తే ఏమౌతుందోననే భయం వెంటాడింది. ప్రస్తుతం అత్యధిక వ్యయంతో సైరాను రూపొందిస్తే ప్రేక్షకులు నీరాజనం పట్టడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరు ప్రాణాపెట్టి చేశారు. అందుకే ఇంత ప్రేక్షకదారణ లభిస్తున్నది అని అన్నారు.

    20 ఏళ్ల వయసు తగ్గించారని

    20 ఏళ్ల వయసు తగ్గించారని

    ఇక సైరా సినిమాలో సరైన సూచనలు ఇచ్చిన సత్యానంద్‌కు థ్యాంక్స్. నా ఏ సినిమాకైనా ఆయన స్క్రిప్టు డాక్టర్. సైరాను సక్రమదారిలో నడిపించడంలో ఆయన సహకారం మరువులేనది. సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే రత్నవేలు గురించి చెప్పుకోవాలి. ఖైదీ నంబర్ 150లో నా వయసును 20 ఏళ్లు తగ్గించి గ్లామర్‌గా చూపించాడు. అలాగే సైరాలో చిరంజీవి కాకుండా ఓ క్యారెక్టర్‌‌ కనిపించేలా చేసిన టెక్నిషియన్ రత్నవేలును ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.

    తమన్నా పాత్రకు అద్భుతంగా

    తమన్నా పాత్రకు అద్భుతంగా

    ఇక గ్లామర్ పరంగా నయనతార, తమన్నా బాగా ఆకట్టుకొన్నారు. సైరా సినిమాలో నా పాత్రను పక్కన పెడితే తమన్నా రోల్‌కు ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి. తమన్నా పాత్ర ప్రతీ ఒక్కరిని కదిలించింది. ఆమె నటనను ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు అని చిరంజీవి అన్నారు. ఇలా ప్రతీ చిన్న పాత్ర ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారిందన్నారు.

    ముంబైలో స్టాండింగ్ ఓవేషన్

    ముంబైలో స్టాండింగ్ ఓవేషన్

    సైరా సినిమా తెలుగుకే పరిమితం కాకూడదు. తొలితరం స్వాతంత్ర్య ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కథను ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నం చేశాం. ఆ అవకాశం మాకు లభించినందుకు గర్వపడుతున్నాం. ముంబైలో ప్రెస్‌కు ప్రివ్యూ వేస్తే జర్నలిస్టులందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. గతంలో బాలీవుడ్‌లో స్టాండింగ్ ఓవేషన్ ఎప్పడో వచ్చిందని చెబతున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ ఎపిక్ అని రాయడం నిజంగా గర్వంగా ఉంది.

    150 ఒక ఎత్తు.. సైరా మరో ఎత్తు

    150 ఒక ఎత్తు.. సైరా మరో ఎత్తు

    సైరా సినిమాపై వస్తున్న రివ్యూలు చూసి ఆనందంగా ఉంది. ప్రతీ ఒక్కరు చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు.. సైరా మరో ఎత్తు అంటుంటే నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి సినిమాను నా బిడ్డ రాంచరణ్ నాకు అందించడం ఇంకా గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అనే భావన కలుగుతున్నది.

    నా బిడ్డలు ఈ సినిమాలో

    నా బిడ్డలు ఈ సినిమాలో

    సైరా చిత్రానికి క్యాస్టూమ్ డిజైనర్‌గా నా కూతురు సుస్మిత పనిచేసింది. ఓ స్టార్ హీరో కూతురు, సోదరి అనే విధంగా కాకుండా మాములు టెక్నిషియన్‌గా పనిచేశారు. కింద కూర్చుని చెప్పులు తాకుతూ పనిచేయడం నాకు అత్యంత సంతృప్తిని కలిగించింది. స్టైలిస్టులు అంజు మోహన్, ఉత్తర మీనన్‌ కూడా పనిచేశారు. ఇక ఇప్పటి వరకు అనుష్క రోల్‌ను సీక్రెట్‌గా ఉంచాలనుకొన్నాం. అందుకే ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు తప్పనిసరిగా చెప్పాలి. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా అద్బుతంగా రాణించారు అని చిరంజీవి అన్నారు.

    English summary
    Megastar's Sye Raa Narsimhareddy movie is going with good at Indian Box office. In this occassion, Producer Ram Charan organised Thank you India meet. Chiranjeevi given emotional speech in this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X