Just In
- 20 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 56 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 11 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 11 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
Don't Miss!
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరుణ్ తేజ్ ముందు డీలా పడ్డ చిరంజీవి.. ఆశ్చర్యపోతోన్న ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేశారు. తెలుగు నాట ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.250కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా.. జెమినీ టీవీలో ప్రీమియర్ షో వేశారు. దీనికి వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.

భారీ ఎత్తున సైరా..
సైరా చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించగా.. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేశారు. వీటికి తగ్గట్టే ఈ సినిమాలో భారీ తారాగణాన్ని కూడా తీసుకొచ్చారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి వారితో ప్రత్యేక పాత్రలను పోషించేలా చేశారు. అయితే ఇదంతా బుల్లితెరపై ఎటువంటి మాయను క్రియేట్ చేయలేకపోయింది.

తుస్సుమన్న టీఆర్పీ..
సంక్రాంతి కానుగా జెమినీ టీవీలో వేసిన ఈ మూవీకి అత్యంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం అందర్నీ షాక్‌క గురి చేసింది. వరుణ్ తేజ్ సినిమా గద్దలకొండ గణేష్ సైరా కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం కొసమెరపు. వీటికి గల కారణాలేంటని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.

మిగతా రాష్ట్రాల్లో అదిరిపోయే టీఆర్పీ..
ఇతర భాషల్లో కూడా సైరా చిత్రం టెలికాస్ట్ అవ్వడం లాంటివి జరిగింది. సినిమా ముందుగా తమిళ్ డబ్ టెలికాస్ట్ అవ్వగా అక్కడ సినిమా కి 15.44 TRP రేటింగ్ దక్కింది. ఇది అక్కడ తెలుగు డబ్ మూవీస్ లో రికార్డ్ బ్రేకింగ్ TRP రేటింగ్ అని చెప్పాలి. ఇక తర్వాత కన్నడ డబ్ టెలికాస్ట్ అయింది. కన్నడలో దాదాపు 6 పాయింట్లను సొంతం చేసుకుంది.

సీరియల్స్‌ను ధాటి..
అయితే సైరాను వీక్ డేలో వేశారని అయినా సరే సీరియళ్ల ధాటిని తట్టుకుని ఆ రేంజ్ టీఆర్పీ రావడం గొప్పేనని, గద్దలకొండ గణేష్ (12.75) శనివారం విడుదలైందని అందుకే సైరా కంటే ఎక్కువగా వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బుల్లితెరపైనా సైరా అంతగా ఆకట్టుకోలేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.