న్యూ పోస్టర్: ‘సైరా’ టీజర్ కోసం ఉత్కంఠగా ఫ్యాన్స్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీ టీజర్ విడుదలకు ముమూర్తం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రేపు (ఆగస్టు 21) ఉదయం 11.30 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ పీఆర్ఓ, నిర్మాత ఎస్‌కెఎన్ ట్విట్టర్ ద్వారా కొత్త పోస్టర్ విడుదల చేశారు.
'సైరా' టీజర్ కోసం కేలం అభిమానులు మాత్రమే కాదు... యావత్ సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మెగాస్టార్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ. 150 నుండి రూ. 200 కోట్ల బడ్జెట్ రేంజిలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్‌తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో ఉండటం, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు లాంటి ప్రముఖులు నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బ్రిటిష్ సైన్యంపై నరసింహారెడ్డి యుద్ధం చేసే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ పోరాట సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
ఆదివారం గీత గోవిందం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న చిరంజీవి.... తీరిక లేకుండా షూటింగ్ జరుగుతోందని, ఒక్కోసారి రాత్రి 2 గంటల వరకు చిత్రీకరణ చేస్తున్నామని, వందల సంఖ్యలో ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్న విషయం వెల్లడించారు. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











