టాలీవుడ్‌లో టీఎస్ఆర్ బిగ్ పార్టీ.. చిరు హల్‌చల్.. బాలయ్య హంగామా.. వెంకీ జోష్

ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నర్సింహారెడ్డి చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. గత ఎనిమిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. గత వారం రోజులుగా సైరా చిత్రానికి సక్సెస్ పార్టీలు జోష్ పెరిగింది. కొద్ది రోజుల క్రితం అల్లు అరవింద్ విందు ఏర్పాటు చేయగా.. తాజాగా విజయదశమి తర్వాత మెగా సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో నందమూరి బాలకృష్ణ పాల్గొనడం అందర్ని ఆకర్షించింది. ఈ పార్టీ వెనుక కథ ఏమిటంటే..

అగ్రనటులు, నేతలతో పార్టీ

అగ్రనటులు, నేతలతో పార్టీ

విజయదశమి పండుగ తర్వాత సినీ పెద్దలందర్నీ టాలీవుడ్ షో మ్యాన్ టీ సుబ్బిరామి రెడ్డి ఒకచోట కలిపారు. ఈ కార్యక్రమం తెలుగు పరిశ్రమకు చెందిన అగ్ర నటులతో కళకళలాడింది. రెబల్‌స్టార్ కృష్ణంరాజు, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటులు మురళీమోహన్ తదితరులు హాజరయ్యారు.

చిరంజీవి సైరా కోలాహలం

చిరంజీవి సైరా కోలాహలం

హై ఎనర్జీతో కూడిన పార్టీలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. సైరా సక్సెస్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు చిరంజీవిని పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అభినందించడం కనిపించింది. చిరంజీవి ముఖంలో సైరా విజయానందం స్పష్టంగా కనిపించడం గమనార్హం.

బాలకృష్ణ సందడి

బాలకృష్ణ సందడి

ప్రముఖులు టి సుబ్బిరామి రెడ్డి ఇచ్చిన పార్టీలో బాలకృష్ణ సందడి చేశారు. అందరితో పలకరిస్తూ.. చిన్నారులతో ఆడుకొంటూ కనిపించారు. అంతేకాకుండా పలువురు రాజకీయ నేతలు కూడా హాజరు కావడంతో వారితో పలకరింపులు, తాజా రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి.

 మాజీ మంత్రి గంటా

మాజీ మంత్రి గంటా

పార్క్ హయత్‌ హోటల్‌లో సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన విందులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హంగామా కనిపించింది. ఆయన బాలకృష్ణ, చిరంజీవితో సన్నిహితంగా ఉండటమే కాకుండా ఇతర నటీనటులతో మమేకమై కనిపించారు. ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ గంటా ప్రత్యేక స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు.

ఆత్మీయ సన్మానాలతో

ఆత్మీయ సన్మానాలతో

సుబ్బిరామి రెడ్డి నిర్వహించిన విందులో పలువురికి ఆత్మీయ సన్మానం చేసినట్టు సమాచారం. పలువురు నటులను, రాజకీయ వేత్తలను ఒక చోట చేర్చి వారి సేవలను అభినందిస్తూ, వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగిందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X