వెండితెరపై మిథాలీ రాజ్ బయోపిక్.. గర్వపడేలా చేస్తానన్న హీరోయిన్
వెండితెరపై బయోపిక్‌లు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన ఓ లెజెండరీ వ్యక్తి జీవిత చరిత్ర సినిమాగా రాబోతోంది. ఇప్పటికే సచిన్, ఎమ్ఎస్ ధోని లాంటి లెజెండరీ ఆటగాళ్ల చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మేరీకోమ్, భాగ్ మిల్కా భాగ్ లాంటి క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి.
బయోపిక్‌లు సిల్వర్ స్క్రీన్‌పై కాసులు కురిపిస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు అటు వైపు దృష్టి మరలిస్తున్నారు. ఇప్పటికే తమిళ తలైవి అమ్మగా కీర్తించబడిన దివంగత నేత జయలలిత బయోపిక్ రాబోతుండగా.. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా సిద్దమవుతోంది. పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ కోసం బ్యాడ్మింటన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. తాజాగా మిథాలీ రాజ్ బయోపిక్‌ను ప్రకటించేశారు.
పింక్, బాద్లా, గేమ్ ఓవర్, సాండ్ కీ ఆంఖ్ చిత్రాలతో ఘన విజయాలు నమోదు చేసిన తాప్పీ.. మిథాలీ రాజ్‌గా అవతారమెత్తబోతోంది. తాప్పీ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతోన్న ఈ బయోపిక్ టైటిల్‌ను శభాష్ మిథుగా ఫిక్స్ చేశారు. రాయిస్ ఫేమ్ రాహుల్ ధోలకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. వయకామ్ అనే సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

మిథాలీ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ చిత్రాన్ని ప్రకటించగా.. తాప్సీ చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతోంది. నిన్ను నువ్వు స్క్రీన్‌పై చూసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాను.. అదే నేను నీకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ అంటూ ట్వీట్ చేసింది. కవర్ డ్రైవ్ షాట్‌లు కొట్టడంలో మిథాలీ రాజ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలసిందే.. అయితే అవి నేర్చుకునే పనిలో పడ్డానని తాప్సీ చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











