ఇంత హైప్ ఎక్కడిది..? తాప్సి గేమ్ ఓవర్..

సొట్ట బుగ్గల సుందరి తాప్సి టాప్ హీరోయిన్‌గా దూసుకు పోనప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ ఆశించిన మేర సూపర్ హిట్ సినిమా తాప్సి ఖాతాలో లేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో గేమ్ ఓవర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది తాప్సి. జూన్ 14 వ తేదీన విదుదల కానున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారట. అంటే ఓ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయనే చెప్పుకోవచ్చు.

కాగా ఈ వార్త చూసిన కొందరు హీరోయిన్ తాప్సికి ఇంత హైప్ ఎక్కడిది..? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమో! సినిమా కథలో దమ్ముందో లేక తాప్సి నటనలో పస ఉందో ఎవరికి తెలుసు. ఎలాగైతేనేం భారీ రేంజ్‌లో సినిమా విడుదల కానుండటం తాప్సికి అనుకూల అంశమే. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ మూడు భాషల్లో జూన్ 14 న ఈ సినిమా విడుదల కానుంది.

Taapsee Pannu latest movie Game Over which is directed by Ashwin Sharavanan. This movie will ready to release on jun 14

ఇప్పటికే విడుదలైన టీజర్, కొద్దిరోజుల క్రితం వచ్చిన థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూరాని సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని చిత్రయూనిట్ చెబుతున్న మాట. ఇప్పటికే తమ సంస్థ గతంలో నిర్మించిన లవ్ ఫెయిల్యూర్, గురు చిత్రాలు సూపర్ సక్సెస్ అయ్యాయని, ఆ లిస్టులో 'గేమ్ ఓవర్' కూడా చేరుతుందని చిత్ర నిర్మాత ఎస్.శశికాంత్ అంటున్నారు. ఇక వణుకు పుట్టించే ఈ హారర్ కథకు ఏతాన్ యోహాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X